Ramya Krishna Son : ఒకప్పుడు హీరోయిన్‌గా సత్తా చాటిన రమ్యకృష్ణ ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్స్‌తో సత్తా చాటుతుంది. బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ పాత్రకి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాతో రమ్యకృష్ణకి కూడా పాన్ ఇండియా ఇమేజ్ దక్కింది. రమ్యకృష్ణ నటిగానే కాకుండా హోస్ట్‌గా కూడా అదరగొడుతుంది . వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ మెప్పిస్తుంది. అయితే తాజాగా రమ్యకృష్ణ తన తనయుడితో తిరుమలలో ప్రత్యక్షం అయింది.కలియుగ దైవం ఏడుకొండల వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కుమారుడు రిత్విక్ వంశీతో కలిసి రమ్యకృష్ణ శ్రీవారి దర్శనం చేసుకున్నారు.
దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో రమ్యకృష్ణ, రిత్విక్‌లకు వేద పండితులు ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన రమ్యకృష్ణతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు కొంత మంది ఆసక్తి కనబరిచారు. కొడుకు చేయి పట్టుకుని రమ్యకృష్ణ ముందుకు సాగారు.రమ్యకృష్ణ కొడుకుని చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. చాలా రోజుల తర్వాత రమ్యకృష్ణ కొడుకుని చూసి అభిమానులు కూడా మురిసిపోయారు. చూస్తుంటే రమ్యకష్ణ తన కుమారుడిని హీరోగా చేయనుందంటూ ప్రచారాలు మొదలుపెట్టారు.
ఇదిలా ఉంటే రంగమార్తాండ మూవీ చిత్ర ప్రమోషన్ సమయంలో కృష్ణవంశీ మాట్లాడుతూ.. ప్రస్తుతం మా అబ్బాయి రిత్విక్ వంశీ టీనేజ్‌లో ఉన్నాడు. అతని అభిరుచులు వారానికి ఒకసారి మారుతుంటాయి. ఒకసారి క్రికెట్ అంటాడు, ఇంకోసారి ఫుట్‌బాల్ అంటాడు… ఇంకోసారి ఇంకేదో అంటాడు. నా భార్య రమ్య వాడిని హ్యాండిల్ చేస్తుంది. వాడి చదువు విషయాలు చూసుకుంటుంది. చెల్లి కూడా రిత్విక్‌ని చూసుకుంటుంది అని చెప్పాడు కృష్ణవంశీ. మొత్తానికి కృష్ణవంశీ తనయుడి పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…