Undavalli Sreedevi : గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రీసెంట్గా .. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిశారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రాజెక్టుల పరిశీలనలో ఉండగా.. శ్రీదేవి తన భర్తతో కలిసి అక్కడికి వెళ్లి కలిశారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీదేవి క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారనే ఆరోపణలురాగా, ఆమెని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. సస్పెండ్ చేసిన కొద్ది రోజులకి శ్రీదేవి.. చంద్రబాబు నాయుడితో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఇక చంద్రబాబుని కలిసిన తర్వాత ఉండవల్లి శ్రీదేవి మీడియాతో మాట్లాడింది.
‘రాజకీయంగా నన్ను భ్రష్టు పట్టించారు. రాజకీయ సన్యాసం చేయించారు. మూడు ఎలక్షన్స్‌లో నా నియోజకవర్గంలో నేను వైసీసీని గెలిపిస్తే.. నా మీద సొంత పార్టీ నాయకులతో, గూండాలతో దాడి చేయించారు. విధ్వంసం సృష్టించారు. మహిళా ఎస్సీ అని కూడా చూడకుండా ప్రవర్తించారు’ అని ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. నేను కష్టాలు పడుతున్న సమయంలో.. చంద్రబాబు, లోకేష్ ఎంతో మద్దతిచ్చారు. చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశా. వైసీపీ గుండాలు నామీద దాడులు చేశారు. దిశా చట్టం ఎక్కడ ఉంది…ప్రస్తుతం తెలంగాణ లో ఉంటున్నా. నాకు రక్షణ కల్పించాలని చంద్రబాబుని అడిగా అని శ్రీదేవి పేర్కొంది.
రాబోవు రోజుల్లో తాను ఏ పార్టీ లో జాయిన్ అవుతానో ఆలోచించి చెబుతాను.నాలుగున్నర నెలలపాటు ఆలోచన చేశా చంద్రబాబు, జగన్ పాలన బేరేజు వేసుకున్నా. నా నిర్ణయం త్వరలో చెప్తా. R5 జోన్ లో ప్లాట్లు ఇవ్వోద్దని ఏపీ హైకోర్టే చెప్పింది. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు’’ అని ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. అమరావతిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అసెంబ్లీ భవనం, హైకోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలన్నింటినీ నిర్మించిందని ఉండవల్లి శ్రీదేవి గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఇటుక కూడా వేయలేదని విమర్శించారు. ‘మనం అన్నీ గమనిస్తున్నాం.. రానున్న రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం’ అని ఆమె అన్నారు.