Tomato Juice : మనకు అందుబాటులో ఉన్న అత్యంత చవకైన కూరగాయల్లో టమాటాలు కూడా ఒకటి. ఇవి మనకు సీజన్లతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. టమాటాలను మనం నిత్యం అనేక రకాల వంటల్లో వాడుతుంటాం. వీటిని ఇతర కూరగాయలతో కలిపి వండుతారు. లేదా వీటితోనే నేరుగా కూరలు చేస్తారు. టమాటాలతో చేసే పప్పు, చారు, పచ్చడి.. వంటివన్నీ ఎంతో రుచిగా ఉంటాయి. అయితే వాస్తవానికి టమాటాలను కూరల ద్వారా కాదు.. నేరుగానే తీసుకోవాలి. అవును.. రోజూ టమాటాలను నేరుగా అలాగే తీసుకోవడం వల్ల మనం ఇంకా ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. రోజూ ఒక కప్పు టమాటా జ్యూస్‌ను తాగితే చాలు.. ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. టమాటాలతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
టమాటాలు మన జుట్టు, చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. టమాటాల్లో విటమిన్ ఎ, సి ఉంటాయి. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా మారుస్తాయి. దీంతో చర్మ రోగాలు, సమస్యలు ఉండవు. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. అలాగే జుట్టు కూడా దృఢంగా, ఆరోగ్యంగా మారుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. చుండ్రు నుంచి బయట పడవచ్చు. శిరోజాలు కాంతివంతంగా మారుతాయి. కనుక టమాటాలను రోజూ జ్యూస్ రూపంలో తీసుకోవాలి.
టమాఆల్లో యాంటీ కార్సినోజెనిక్ గుణాలు ఉంటాయి. వీటిల్లో లైకోపీన్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటుంది. దీంతో పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. టమాటాల్లో విటమిన్ కె, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరాన్ని దృఢంగా మారుస్తాయి. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎముకలు బలంగా మారుతాయి. టమాటాలను తీసుకోవడం వల్ల పొగ తాగేవారికి ఎంతో మేలు జరుగుతుంది. దీని వల్ల పొగ తాగడం కారణంగా వచ్చే సమస్యల నుంచి ముందుగానే జాగ్రత్త పడవచ్చు. అలాగే టమాటాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. షుగర్‌ను అదుపులో ఉంచుతాయి.
టమాటాల్లో విటమిన్ ఎ, బి, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి హైబీపీని తగ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. టమాటాల్లో క్రోమియం అధికంగా ఉంటుంది. ఇది షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అలాగే టమాటాలను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్దకం అన్నది ఉండదు. వీటిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. టమాటాల్లో ఉండే విటమిన్ సి శరీరాన్ని రోగాల బారి నుంచి రక్షిస్తుంది. దీంతో రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. రోగాలు రావు. ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు.
టమాటాలను తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది. వీటిల్లో ఉండే కార్నిటైన్ అనే అమైనో యాసిడ్ కొవ్వును కరిగిస్తుంది. దీంతో బరువు తగ్గుతారు. రోజూ టమాటా జ్యూస్‌ను తీసుకోవడం వల్ల శరీరంలో 30 శాతం వరకు బరువు తగ్గవచ్చని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కనుక టమాటాలను రోజూ తీసుకోవాల్సిందే. వీటితో చేసిన జ్యూస్‌ను రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అనంతరం తీసుకుంటే ఎన్నో లాభాలను పొందవచ్చు. అయితే కిడ్నీ స్టోన్లు, మూత్రాశయ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు టమాటా జ్యూస్‌ను తాగితే మంచిది. లేదంటే సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…