టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రేమ వివాహాలు కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఈ ప్రేమ వివాహాల్లో కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని విడాకులకు దారి తీశాయి. అయితే ముఖ్యంగా ప్రేమ వివాహం చేసుకొని వార్తల్లో నిలిచిన హీరోయిన్లు కూడా ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం. తెలుగింటి ఆడపడుచుగా దక్షిణాదితోపాటు బాలీవుడ్ లోనూ సత్తా చాటిన జయప్రద సైతం రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ నహతాని ఆమె వివాహం చేసుకున్నారు. అప్పటికే ఆయనకు పెళ్లయి పిల్లలు ఉండడంతో తమ వివాహ విషయాన్ని బయటకు చెప్పలేదు జయప్రద.
అందాల తార శ్రీదేవి రెండుసార్లు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలినాళ్లలో అప్పటి స్టార్ హీరో మిథున్ చక్రవర్తిని ప్రేమించి ఆయనను రహస్యంగా పెళ్లాడారు. అయితే మూడేళ్లకే వీరి పెళ్లి పెటాకులైంది. బోనీ కపూర్ ని ప్రేమించిన శ్రీదేవి అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ప్రేమ, పెళ్లి, పిల్లలు విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచి మొత్తం పరిశ్రమకే షాక్ ఇచ్చింది శ్రియా శరణ్. రష్యాకి చెందిన ఆండీ కొశ్చివ్ ని ప్రేమించిన విషయం గానీ, పెళ్లి చేసుకున్న విషయం గానీ, చివరికి సంతానం విషయం గానీ బయటకు తెలియకుండా జాగ్రత్తపడింది. ఆ తర్వాత తీరిగ్గా విషయం చెప్పడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…