Movies : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న రామ్ పోతినేని నటించిన డబుల్ ఇస్మార్ట్, రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు తొలిరోజు ఓ మోస్తరు వసూళ్లు రాబట్టాయి. కాని తర్వాత తర్వాత ఆ సినిమాల కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయ్యాయి. భారీ అంచనాలతో రూపొందిన ఓ చిత్రం మాత్రం పూర్తిగా నిరాశనే ఎదుర్కొంటోంది. దీంతో కలెక్షన్లు దారుణంగా వస్తున్నాయి. చిత్రానికి నైజాంలో రూ. 11.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 11.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 2.00 కోట్లు వ్యాపారం అయింది. ఇలా వరల్డ్ వైడ్‌గా ఇది రూ. 31.00 కోట్లు బిజినెస్ చేసింది.
ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి రెస్పాన్సే లేదు. ముఖ్యంగా సండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ ఈ సినిమా బాగా డౌన్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 55 లక్షలు షేర్ మాత్రమే రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ. 65 లక్షలు వసూలు చేసింది. ఇలా 4 రోజుల్లో ఈ చిత్రం కేవలం రూ. 7.50 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి నిరాశ పరిచింది. కోట్లలో రావల్సిన లాభాలు లక్షలలోకి వచ్చాయి. వరల్డ్ వైడ్‌గా 31 కోట్ల వరకు ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. థియేటర్ల ద్వారా 32 కోట్లు వస్తే నిర్మాతలు లాభాల్లోకి అడుగుపెడతారని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే అంత రాబట్టడం అసంభవమే అని అంటున్నారు.
ఇక ఇదిలా ఉంటే సదరు హీరోకి బోలెడన్ని ఫ్లాపులు ఉన్నా ఇంత దారుణమైన డిజాస్టర్ ఎప్పుడు చూడలేదు. దారుణమైన ఫ్లాప్ అయిన కూడా సదరు దర్శకుడు సినిమా హిట్ అవుతుందనే భ్రమలో ఉన్నాడు. కనీసం యావరేజ్ టాక్‌తో అయిన నడుస్తుందని అనుకుంటున్నాడు. హీరో అయితే పూర్తిగా ముఖం చాటేశాడు. నైజాంలో ఈ సినిమా కనీసం రెండు కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది అంటే ఈ సినిమా ఎంత దారుణమైన ఫ్లాప్‌గా నిలిచిందో అని ప్రతి ఒక్కరు ముచ్చటించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి చూసి నిర్మాతే బాధపడుతున్నారు. తాను బయ్యర్స్‌కి సాయం చేస్తానని నిర్మాత హామీ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది.