Minister Nara Lokesh : చంద్రబాబు తనయుడిగా రాజకీయాలలోకి వచ్చిన లోకేష్ ఇప్పుడిప్పుడే స్ట్రాంగ్ అవుతున్నారు. ఇటీవల కూటమి విజయంతో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. అయితే లోకేష్‌పై విమర్శలు కొత్త కాదు. గతంలో పప్పు అంటూ ప్రతిసారి వైసీపీ నాయకులు కామెంట్ చేసేవారు. రీసెంట్‌గా మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..నారా లోకేష్‌ని విమర్శించారు. నారా లోకేష్ ఓ విషయమై సోషల్ మీడియాలో ట్వీటేశారు. దానికి కౌంటర్ ఎటాక్ వైసీపీ నుంచి ‘నిక్కర్ మంత్రి’ అంటూ వచ్చింది. దానికి టీడీపీ నుంచి రివర్స్ ఎటాక్ ‘కట్ డ్రాయర్ ఎమ్మెల్యే’ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీదకు వెళ్ళింది.
ఇక్కడితో ఈ ట్వీట్ల రచ్చ ఆగినందుకు సంతోషం.! లేకపోతే, ‘కట్ డ్రాయర్ ఎమ్మెల్యే’ అంటూ టీడీపీ నుంచి వచ్చిన ప్రస్తావనపై, వైసీపీ నుంచి ఇంకెంత జుగుప్సాకరమైన కౌంటర్ ఎటాక్ వచ్చి వుండేదో.! ఒకరేమో, ప్రతిపక్ష హోదా కోసం అటు అసెంబ్లీ స్పీకర్‌ని బతిమాలుకుని, ఇటు హైకోర్టు మెట్లు కూడా ఎక్కారాయె. అలాంటప్పుడు, ఆ పార్టీ ఎంత బాధ్యతగా వ్యవహరించాలి.? అలాగే అధికారంలో వున్న టీడీపీ ఇంకెంత బాధ్యతగా వుండాలి. కాని వారు అవన్నీ గాలికి వదిలేసి మాటలు వదిలేస్తున్నారు. అయితే వైసీపీ నాయకులు . లోకేష్ గతానికి కంటే ఎదిగాడు అని వైసీపీ వారు చెప్పకనే చెబుతున్నారు అని అంటున్నారు. వైసీపీకి ఏమీ కాని లోకేష్ నిక్కర్ స్థాయి దాకా వచ్చారు అంటేనే సగం విజయమే కదా అని కొందరి నుండి వినిపిస్తున్న మాట.
కొందరు టీడీపీ నాయకులు లోకేష్ గొప్పతనాన్ని వైసీపీ ఎపుడు ఒప్పుకుంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే లోకేష్ ని నిక్కర్ మంత్రి అని వైసీపీ సోషల్ మీడియా చెలగాటం ఆడితే జగన్ ని పట్టుకొని కట్ డ్రాయర్ ఎమ్మెల్యే అంటూ టీడీపీ వారు అనడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ రాజకీయ పరిభాష కానీ ఈ విమర్శలు కానీ హద్దులు ఎపుడో దాటేసాయని ఇపుడు దిగజారిపోయాయని అంటున్నారు. పాలిటిక్స్ లో పెద్ద నాయకుల నుంచి చిన్న వారి వరకు ప్రతి ఒక్కరు దిగజారుడు కామెంట్స్ చేసుకుంటున్నారని కొందరు మండిపడుతున్నారు.