Tejaswini : ఇదేందిది.. ఆ బుడ్డోడు బాల‌య్య కూతురి బుగ్గ అలా గిల్లేసాడు..!

Tejaswini : చంద్ర‌బాబు అరెస్ట్‌ని చాలా మంది ఖండిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఈ వ‌య‌స్సులో ఇన్ని రోజుల పాటు ఆయ‌న‌ని జైలులో ఉంచ‌డం ప‌ట్ల చాలా మంది ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. హైటెక్‌సిటీ, సైబర్‌ టవర్స్ నిర్మాణం పూర్తై 25ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో చంద్రబాబుకు కృతజ్ఞతగా మ్యూజికల్ కన్సర్ట్‌ ఏర్పాటు చేశారు. ఈ కన్సర్ట్ లో పెద్ద ఎత్తున‌ పాల్గొని చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.ఇక ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం హాజరయ్యారు.దర్శకుడు రాఘవేంద్ర రావు,బోయపాటి శ్రీను, సినీ నటుడు మురళీ మోహన్, సినీ నిర్మాత బండ్ల గణేష్, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు , సెర్లింగంపల్లీ ఎమ్మెల్యే అరికపుడి గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బాల‌కృష్ణ కూతురు తేజ‌స్విని కూడా హాజ‌రైంది.అయితే ఆమె త‌న సీటులో కూర్చున్న స‌మ‌యంలో పక్క‌నే ఉన్న బుడ్డోడు ఆమె బుగ్గ గిల్ల‌గా ఒక్క సారిగా షాకైంది తేజ‌స్విని. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. అస్స‌లు ఒక్క నిమిషం ఏం జ‌రిగిందో ఆమెకి అర్ధం కాలేదు. ఇక సీబీఎన్ వెంటే తాము అంటూ నినాదాలతో స్టేడియం హోరెత్తింది. సైబర్ టవర్స్ నిర్మించి ఇరవై ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంలో చంద్రబాబుకు కృతజ్ఞత తెలిపేందుకు సీబీఎన్ గ్రాటిట్యూడ్ పేరిట గచ్చి బౌలి స్టేడియంలో సంగీత విభావరిని ఏర్పాటు చేశారు.

Tejaswini video viral chandra babu gratitude meeting
Tejaswini

చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ముక్త కంఠంతో ఖండించారు. బెంగళూరుకు చెందిన బీ్ గురు బ్యాండ్ బృందం సంగీత విభావరి నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నారా, నందమూరి కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలుగు భాష చరిత్ర ఉన్నంతవరకు తెలుగు దేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉంటారని దర్శకుడు బోయపాటి వ్యాఖ్యానించారు. బాబు బయటికి రావాలి వచ్చిన వెంటనే అధికారంలోకి రావాలని అయన అన్నారు.చంద్రబాబుకు మద్దతుగా వచ్చిన ఐటీ ఉద్యోగులకు బోయపాటి శ్రీను కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ ను చూస్తుంటే తెలుగు ప్రజల గుండెలు మండుతున్నాయన్నారు.అరాచక శక్తులకు గుణపాఠం చెప్పేందుకు తెలుగు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ముర‌ళీ మోహ‌న్ పేర్కొన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago