Tejaswini : నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం భగవంత్ కేసరి. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి లాంటి హిట్స్ తో అలరిస్తున్నాడు బాలయ్య.అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో అనిల్ రావిపూడి ఆడపిల్లల గురించి ఇచ్చిన మెసేజ్ అందరికీ చేరువవుతోంది. శ్రీలీల బాలయ్య కుమార్తెగా నటించగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం విజయం సాధించిన సందర్భంగా సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు.
ఈ వేడుకకి రాఘవేంద్ర రావు అతిథిగా హాజరయ్యారు. రాఘవేంద్ర రావు వేదికపై మాట్లాడుతూ చేసిన పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. ఈ చిత్రంలో బాలయ్య నటించిన ఎమోషనల్ సీన్స్ చూస్తే స్వర్గీయ ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు అని అన్నారు. బాలయ్య డైలాగ్ చెబితే బాంబు పేలినట్లుగా ఉంటుంది. కానీ బాబు కన్నీళ్లు పెట్టుకోవడం చూశా. బాలయ్యకి సీజన్ తో సంబంధం లేదు. వర్షాకాలం అయితే చినుకు జై బాలయ్య అంటూ శబ్దం చేస్తాయి. వేసవిలో సూర్య కిరణాలు కూడా జై బాలయ్య అంటూ వస్తాయి. చలికాలంలో పిల్లగాలికి పచ్చ జెండాలు జై బాలయ్య అంటూ రెపరెపలాడతాయి. హిందూ పురంలోనే కాదు ఆంధ్ర మొత్తం పచ్చ జెండాలు రెపరెపలాడతాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బాలయ్య మాట్లాడుతూ తనకు పోటీ తన సినిమాలే అని చాలా స్ట్రాంగ్ గా బాలకృష్ణ చెప్పారు. భగవంత్ కేసరి షేర్ కలెక్షన్స్ కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య… పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. అయితే వేదికపై అందరికి గిఫ్ట్ లు ఇస్తున్న సమయంలో బాలయ్య కూతురు తేజస్వి కూడా వేదికపైకి వచ్చింది. రాఘవేంద్రరావు చేతుల మీదుగా గిఫ్ట్ తీసుకుంది. అయితే ఆ సమయంలో బాలయ్య తన కూతురిని చూసి షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. అంతేకాకుండా ఆశీర్వచనాలు కూడా అందించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…