Taraka Ratna Tattoo : టాలీవుడ్ సినీ హీరో, టీడీపీ యువ నేత నందమూరి తారకరత్న శనివారం రాత్రి బెంగుళూరులోని నారాయణ హృదయాలయలో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. గత 23 రోజులుగా తారకరత్న ట్రీట్‌మెంట్ కొనసాగుతుండగా, ఆయన పరిస్థితి మరీ క్షీణించటంతో తారకరత్న తరలిరాని లోకాలను వెళ్లిపోయారు. ఆయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇక తారకరత్న మృతి తర్వాత ఆయనకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తారకరత్న చేతిపై ఉన్న టాటూ నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకీ తారకరత్న చేతి ఉన్న టాటూ ఏంటంటే అది సింహం బొమ్మ.
నందమూరి బాలకృష్ణపై ఉన్న అభిమానం కారణంగానే తారకరత్న ఆ టాటూ వేయించుకున్నాడని తెలుస్తుంది.. కేవలం టాటూ మాత్రమే కాదండోయ్.. ఆ టాటూ కింద బాలకృష్ణ ఆటోగ్రాఫ్ కూడా పచ్చబొట్టుగా ఉంటుంది. బాబాయ్‌పై అబ్బాయ్‌కి ఉన్న అనుబంధం అలాంటిది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఈ టాటూను బాబాయ్ బాలకృష్ణపై ఉన్న ప్రేమకు గుర్తుగా వేయించుకున్నారు. తారకరత్నకు స్ట్రోక్ వచ్చి పడిపోయినప్పటి నుండి బాలకృష్ణ దగ్గరుండి అంతా తానై చూసుకున్నారు. బెంగుళూరు నారాయణ హృదయాలయ డాక్టర్స్‌తో ఎప్పటికప్పుడు చర్చలు జరపడమే కాక ప్రత్యేకంగా వైద్యులను పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పించారు బాలకృష్ణ.

బాలకృష్ణ ఎక్కడున్నా కూడా బెంగుళూరుకి వెళ్లి తారకరత్న పరిస్థితిని దగ్గరుండి గమనిస్తూ వచ్చారు. బాబాయ్, అబ్బాయ్ మధ్య అంత మంచి అనుబంధం ఉండింది. తారకరత్నని మొదటి నుండి చాలా ప్రేమగా చూసుకున్నారు బాలకృష్ణ. ఆయనని ఫ్యామిలీ మొత్తం దూరం ఉంచినప్పుడు బాలకృష్ణనే దగ్గరకి తీసారు. కుటుంబానికి నచ్చని వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడనే కారణంతోనే అతడిని ఫ్యామిలీ కొద్ది రోజుల పాటు దూరం ఉంచింది. ఏదేమైన అతి చిన్న వయస్సులోనే తారకరత్న ఇలా కన్నుమూయడం ప్రతి ఒక్కరిని శోక సంద్రంలోకి నెడుతుంది.