నందమూరి ఫ్యామిలీలో విషాదం నెలకొంది. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తారకరత్న శనివారం కన్నుమూసారు. కొద్ది సేపటి క్రితం తారకరత్న మృతదేహం బెంగళూరు నుండి హైదరాబాద్‌కి చేరుకుంది. తారకరత్న మృతదేహాన్ని మోకిలలోని తన నివాసానికి తరలించారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారని తెలుస్తుంది.. ఇక అదే రోజు సాయంత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే తారకరత్నని బ్రతికించేందుకు ఎంత ప్రయత్నించిన కూడా ఆ ప్రయత్నాలు విఫలం అయ్యాయి.
23 రోజులపాటు వైద్యులు అహర్నిశలు శాయశక్తులా ప్రయత్నించిన కూడా తారకరత్నని బతికించలేకపోవడానికి మొదటి రోజు చేసిన తప్పే కారణమా? అని సందేహాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. ఎవరికైన హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు చాలా తొందరగా సీపీఆర్ చేయాల్సి ఉంటుంది. కాని హార్ట్ ఎటాక్ వచ్చిన రోజు తారకరత్న విషయంలో సీపీఆర్ చేయడానికి దాదాపు 45 నిమిషాల సమయం ఆలస్యం చేశారు. దాంతో హార్ట్ హొల్స్ లో బ్లడ్ క్లోట్ అయిపోయి.. బ్రెయిన్ కి సప్లై ఆగిపోవడం వల్లే తారకరత్న పరిస్థితి ఇంత విషమంగా మారింది. ఒకవేళ సరైన టైంలో సీపీఆర్ చేసి ఉంటే.. తారకరత్న పరిస్థితి ఇంత సీరియస్‌గా ఉండేది కాదని కొందరు చెప్పుకొస్తున్నారు.
మొదటి రోజు జరిగిన ఆ ఒక్క తప్పు వల్లే తారకరత్న పరిస్థితి ప్రాణాపాయంగా మారిందని వైద్యులు చెబుతున్న మాట. కాగా, బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి కన్నుమూసిన సినీ నటుడు నందమూరి తారకరత్న భౌతిక కాయం బెంగళూరు నుంచి గత రాత్రి అంబులెన్స్‌లో రంగారెడ్డి జిల్లా మోకిలలోని ఆయన నివాసానికి చేరుకుంది. తారకరత్నను కడసారి చూసేందుకు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు. ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు. తారకరత్న ఇక లేడని తెలిసి అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు.