Taraka Ratna Pedda Karma : నందమూరి ఫ్యామిలీ హీరో తారక రత్న జనవరి 27వ తేదీ గుండెపోటుకి గురై దాదాపు 23 రోజులపాటు బెంగళూరు నారాయణ హృదయాలయాలో చికిత్స తీసుకుంటూ ఫిబ్రవరి 18వ తేదీ మరణించిన విషయం విదితమే. ఇలా చిన్న వయసులోని తారకరత్న గుండెపోటుకి గురై మరణించడం ప్రతి ఒక్కరిని కలిచి వేసింది. తారకరత్న మరణించాడంటే ఎవరు నమ్మలేకపోతున్నారు. ముఖ్యంగా ఆయన భార్య ఎంతో కుమిలిపోతుంది. అయితే మార్చి రెండవ తేదీ హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో తారకరత్న పెద్దకర్మ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరై తారకరత్నకు చిత్రపటానికి నివాళులు అర్పించారు.
తారకరత్న పెద్ద కర్మలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తారకరత్న పెద్ద కార్యక్రమానికి హాజరైన నందమూరి కుటుంబ సభ్యులంతా ఓ చోట కూర్చుని ఉండగా బాలయ్య అందరినీ పలకరిస్తూ వెళ్లారు. ఇక బాలయ్య వస్తున్నాడని తెలిసి కల్యాణ్, తారక్‌లు బాబాయ్‌ని చూడగానే లేచి నిలబడ్డారు. అయితే బాలయ్య ఎన్టీఆర్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంకా తారక్‌ని దూరంగానే పెట్టారా అని కొందరు, మరోసారి తారక్‌ను అవమానించారు అంటూ నెట్టింట అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఇలాంటి ఫ్యామిలీ సభ్యులతో ఎలా ఉంటున్నావన్న అంటూ ఎన్టీఆర్‌ను కొందరు ఫ్యాన్స్ అయితే కామెంట్స్ రూపంలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బాలకృష్ణ ప్రవర్తించిన తీరేం బాగోలేదని బాహాటంగానే చెప్పేస్తున్నారు. హరికృష్ణ మరణించిన తర్వాత బాలకృష్ణ… ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లతో కొంత క్లోజ్‌గానే ఉన్నట్టు కనిపించిన ఆ తర్వాత దూరం పెరిగినట్టు అర్ధమవుతుంది.. ఎన్టీఆర్ రాజకీయాలలోకి వస్తున్నాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే బాలయ్యతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు అతడిని దూరం పెట్టారనే ప్రచారం నడుస్తుంది. దీనిపై నందమూరి ఫ్యామిలీకి సంబంధించి ఎవరైన స్పందిస్తారా అన్నది చూడాలి.
Brother's @tarak9999 & @NANDAMURIKALYAN Respect Towards Elders ❤️❤️. pic.twitter.com/jGfONERyfD
— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) March 2, 2023