Manchu Manoj : మంచు మనోజ్.. భూమా మౌనికా రెడ్డి గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నారని, వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అనేక ప్రచారాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు కలిసి కొంత కాలం సహజీవనం చేసినట్టు వార్తలొచ్చాయి. అయితే వీరి పెళ్లికి సంబంధించి అనేక ప్రచారాలు సాగిన సమయంలో నేడు వీరిద్దరు పెళ్లి పీటలెక్కబోతున్నట్టు తెలిసింది. కానీ ఇప్పటి వరకు భూమా మౌనికారెడ్డితో పెళ్లినిగానీ, ప్రేమ విషయాన్ని గానీ అధికారికంగా ప్రకటించలేదు మనోజ్. తాజాగా అధికారికంగా ప్రకటించారు. కాబోయే భార్యని పరిచయం చేశారు.
ట్విట్టర్ ద్వారా పెళ్లికూతురు అంటూ భూమా మౌనికా రెడ్డి ఫోటోని పంచుకున్నారు మంచు మనోజ్. పెళ్లికి ముస్తాబవున్న భూమా మౌనికారెడ్డి.. కూర్చొని ఉన్న ఫొటో షేర్ చేస్తూ.. ఇందులో `పెళ్లికూతురు` అంటూ `మనోజ్ వెడ్స్ మౌనికా` అనే యాష్ ట్యాగ్‌ని షేర్ చేశారు. నేడు శుక్రవారం(మార్చి 3న) వీరిద్దరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. కాగా వీరిద్దరికి ఇది రెండో పెళ్లి అనే విషయం తెలిసిందే. దీని కన్న ముందు మంచు లక్ష్మి తన ఇన్‌స్టా స్టోరీలో.. ప్రీవెడ్డింగ్ సెలబ్రషన్స్, మెహందీకి సంబంధించిన ఫోటోలు షేర్ చేసి హింట్ ఇచ్చింది.
హైదరాబాద్‌లోనే తన సోదరి మంచు లక్ష్మి ఇంట్లో ఈ రోజు రాత్రి 8.30 గంటలకు ఇరు కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలోమంచు మనోజ్ రెండో వివాహం చేసుకోబోతున్నాడు. మంచు మనోజ్ పంచుకున్న ట్వీట్‌కి వారి అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు. కాగా, మంచు మనోజ్ 2015లో హైదరాబాద్‌కి చెందిన ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్నాడు. నాలుగేళ్లు తర్వాత అనగా 2015లో మనోజ్ ఆమెతో విడాకులు తీసుకున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడిపోయారని సమాచారం.