Taraka Ratna Last Wish : నందమూరి ఫ్యామిలీ హీరో తారకరత్న శనివారం గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. 39 ఏళ్ల వయస్సులోనే ఆయన ఇలా కన్నుమూయడం అందరిని షాక్‌కి గురి చేసింది. సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చి .. పూర్తి స్థాయిలో రాజకీయాల్లో వస్తున్నట్లు తారకరత్న ప్రకటించిన కొద్ది రోజుల్లోనే మరణించడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని తారకరత్న ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించారు. తెలుగు దేశం పార్టీలో బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు కూడా చేయడం మనం చేశాం.
రాజకీయంగా ఓవైపు యాక్టివ్ అవుతున్న నేపథ్యంలో.. అతను ఎక్కడి నుండి పోటీ చేస్తారనే దానిపై ప్రచారం కూడా నడిచింది. ఎమ్మెల్యే కొడాలి నాని ప్రాతినిథ్యం వహిస్తున్న గుడివాడ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతారని వార్తలు వచ్చాయి. దివంగత ఎన్టీ రామారావు జన్మించిన నిమ్మకూరు గ్రామం, గుడివాడ శాసనసభ స్థానంలో ఉండటంతో.. అక్కడి నుంచి నందమూరి వారసుడైన తారకరత్నను పోటీకి దింపడం ద్వారా టీడీపీకి, చంద్రబాబుకు కొరకరాని కొయ్యగా ఉన్న కొడాలి నానికి చెక్ పెట్టాలని అధిష్టానం భావించారని కొంత ప్రచారం అయితే నడిచింది.

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన తాత,బాబాయ్ లాగే తారకరత్న కూడా ప్రజాసేవ చేయాలనే ఒక కోరిక తారకరత్నకి బాగా ఉండేదట.. అంతే కాదు తారక రత్న చివరి కొరకు కూడా ఇదేనట. కానీ చివరి కోరిక తీరకుండానే తారక రత్న చనిపోయారు అని తెలిసి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తారకరత్న ఇదివరకే చాలాసార్లు టీడీపీ ప్రచారాలలో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. ఆ అనుభవంతో ఇప్పుడు ఎన్నికలలో పోటీ చేసి గెలుస్తాడని అందరు అనుకున్నారు. కాని చిన్న వయస్సులో ఆయన ఇలా మృతి చెందడం అందరిని కలిచివేస్తుంది.