మధుమేహం ఎంతోమందిని పీడిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య. ఈ రోజుల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా డయాబెటిస్ వ్యాధికి గురవుతున్నారు. ఒక్కోసారి స్కూలుకు వెళ్లే చిన్నారులు కూడా ఈ వ్యాధికి గురవుతున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మధుమేహ వ్యాధిని ముందే నిర్మూలించకపోతే అనేక వ్యాధులకు కారణమవుతుంది. మారుతున్న జీవన శైలి, తీసుకునే ఆహారం, ఒత్తిడి, శరీరానికి తగినంత వ్యాయమం లేకపోవడం మధుమేహానికి దారితీస్తుంది. తినే పదార్థాల్లో చక్కెర ఉంటుందని చాలా పదార్థాలు, పండ్లకు దూరంగా ఉంటారు డయాబెటిక్ పేషెంట్లు. అయితే మధుమేహ రోగులు కచ్చితంగా ముల్లంగి తీసుకోవడం అవసరం. చాలామందిలో ప్రస్తుతం మధుమేహం ప్రాణాంతక వ్యాధిలా మారుతుంది.
అయితే ఈ వ్యాధి నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ ముల్లంగి దుంపను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే గుణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించి మధుమేహం తగ్గించేందుకు సహాయపడుతుంది. ముల్లంగిలో ఉండే పీచు ఆకలిని నియంత్రిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను నియంత్రించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, అజీర్ణం, ప్రేగు సంబంధిత ఇన్ఫెక్షన్లు మరియు ఇతర సమస్యలను నివారించడానికి ఉపయోగపడుతుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తపోటు సమస్యలను తగ్గించగలదు. ముల్లంగిలో ఉండే ఫ్లేవనాయిడ్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి శరీరానికి హాని కలగకుండా కాపాడతాయి.
ముల్లంగిలో సహజమైన నైట్రేట్లు ఉన్నాయి, ఇవి శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇందులో ఉన్న విటమిన్లు, జింక్ మొదలైన అనేక పోషకాలు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీనిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తొలగిస్తుంది. ఈ కూరగాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండేందుకు సహాయపడుతుంది. ముల్లంగిలో విటమిన్ సి ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది శరీరాన్ని సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉన్న తక్కువ కేలరీలు బరువు తగ్గించుకునేందుకు తోడ్పడతాయి.