Taapsee : అందాల ముద్దుగుమ్మ తాప్సీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మొదట ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు తాప్సి తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మొదటి సినిమా మంచి హిట్ అవడంతో ఈమెకు తెలుగులో వరుసగా అవకాశాలు లభించినప్పటికీ ఈమెకు హీరోయిన్ గా తగిన గుర్తింపు దక్కలేదు.
తెలుగులో ఝుమ్మంది నాదం, వస్తాడు నా రాజు, వీర, మిస్టర్ పర్ఫెక్ట్, సాహసం, మొగుడు, దరువు,గుండెల్లో గోదారి, షాడో, ఆనందోబ్రహ్మ లాంటి మంచి మంచి సినిమాలలో నటించిన తాప్పీకి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఈ క్రమంలో టాలీవుడ్ వైపు చూడకుండా బాలీవుడ్ లో వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది తాప్సి. తెలుగు సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
తాజాగా హీరోయిన్ తాప్సి సిక్స్ ప్యాక్ బాడీ తో కనిపించి ఒకేసారిగా షాక్ ఇచ్చింది. షారుఖ్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డుంకీ’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న తాప్సీ పన్ను, ‘నామ్ షబానా’ సీక్వెల్ చెయ్యడానికి కూడా రెడీ అయ్యింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కోసం రెడీ అయ్యిందా లేక క్యాజువల్ గా ఫిట్ అయ్యిందో తెలియదు కానీ తాప్సీ మాత్రం సిక్స్ ప్యాక్ లో మెరిసింది. తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో జిమ్ ట్రైనర్ ‘సుజీత్ కర్గుట్కర్’తో కలిసి పోజులిచ్చిన రెండు ఫోటోలను పోస్ట్ చేసింది తాప్సీ. ఈ సిక్స్ ప్యాక్ ను చూసి నెటిజన్ లు స్టన్ అవుతున్నారు.