కరోనా నేపథ్యంలో ఇప్పటికే అనేక కంపెనీలకు చెందిన ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం లేకపోయేసరికి ఆఫీసులకు రావాలని కంపెనీలు ఉద్యోగులను బతిమాలుతున్నాయి. కానీ తమకు జీతం తక్కువ ఇచ్చినా సరే ఆఫీస్‌కు రామని చెబుతున్నారు. అంతగా ఒత్తిడి చేస్తే ఉద్యోగం వదిలేస్తామని చెబుతున్నారు. దీంతో కంపెనీలు నెత్తి నోరు కొట్టుకుంటున్నాయి. అయితే స్విగ్గీ మాత్రం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేందుకే మొగ్గు చూపింది. ఈ కంపెనీలోని ఉద్యోగులు ఇకపై ఇంటి నుంచే పనిచేయవచ్చు.
స్విగ్గీ ప్రవేశపెట్టిన కొత్త పాలసీ ప్రకారం.. ఆ కంపెనీలో పనిచేస్తున్న కార్పొరేట్, సెంట్రల్ బిజినెస్, ఫంక్షన్స్, టెక్నాలజీ విభాగాలకు చెందిన సిబ్బంది ఇకపై ఇంటి నుంచే పనిచేయవచ్చు. అయితే ఉద్యోగులు సీనియర్లు అయి ఉండాలి. కొత్తగా చేరే వారికి ఈ అవకాశం లేదు. అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి మాత్రం ఇలా అవకాశం కల్పిస్తారు. 3 నెలలకు ఒకసారి వారం రోజుల పాటు ఉద్యోగులు తాము ఎంచుకుకున్న ప్రదేశంలో ఉండి పనిచేయవచ్చు. ఆఫీస్‌కు రావాల్సిన పనిలేదు.
ఇక పార్ట్‌నర్ ఫేసింగ్ రోల్స్‌లో పనిచేసేవారు మాత్రం తప్పనిసరిగా ఆఫీస్‌కు రావల్సి ఉంటుందని స్విగ్గీ తెలియజేసింది. అయితే ఎంతో మంది మేనేజర్లు, ఉద్యోగుల నుంచి ఫీడ్‌బ్యాక్ పొందిన తరువాతనే ఉత్పాదకత పెరుగుతుందన్న ఉద్దేశంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని స్విగ్గీకి చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలా ఇప్పటికే అనేక కంపెనీలు సదుపాయాన్ని కల్పిస్తున్నాయని.. కనుక తాము కూడా ఈ నూతన మోడల్‌ను అమలు చేసి ఫలితాలను విశ్లేషిస్తామని.. బాగుంటే దీన్ని మరింత విస్తరిస్తామని తెలిపారు.
కాగా దేశవ్యాప్తంగా స్విగ్గీ సేవలు ప్రస్తుతం 487 నగరాలు, పట్టణాల్లో లభిస్తుండగా.. 27 రాష్ట్రాల్లో స్విగ్గీ ఉనికిలో ఉంది. ఈ క్రమంలోనే 2020 నుంచే స్విగ్గీ ఉద్యోగులకు మరింత సులభంగా పనిచేసే సదుపాయాలను కల్పించే పాలసీని ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి దానికి మార్పులు చేర్పులు చేస్తూ వస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఈ కొత్త పాలసీని ప్రకటించారు. దీంతో 3 నెలలకు ఒకసారి ఉద్యోగులు 7 రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయవచ్చు. అయితే ఈ పాలసీ వల్ల ఫలితాలు ఎలా వస్తాయోనని స్విగ్గీ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…