తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యం గురించి.. ఈ విష‌యాలు మీకు తెలుసా..?

తిరుమ‌ల శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామిని భ‌క్తులు క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవంగా కొలుస్తారు. ఎందుకంటే ఆయ‌న‌ను ద‌ర్శించుకుని ఏం కోరుకున్నా స‌రే త‌ప్ప‌క నెర‌వేరుస్తాడు. అలాగే క‌లియుగంలోనూ ఆయ‌న ఏడుకొండ‌లు దిగి వ‌చ్చి భ‌క్తుల స‌మ‌స్య‌ల‌ను తీర్చాడ‌ని పురాణాలు చెబుతున్నాయి. క‌నుక‌నే ఆయ‌న‌ను క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం అని అంటారు. ఇక మ‌న పెద్ద‌లు దేవుడిని ప్రత్యక్షంగా చూడాలంటే తిరుమల వెళ్లాల‌ని చెబుతుంటారు. తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామిని చూస్తే ప్రత్యక్షంగా దేవుడిని చూసిన ఫీలింగ్ కలుగుతుంద‌ట‌.

ఇక వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్న అనంత‌రం క‌లిగే ఆ భావనను వ్యక్తపరచలేం. తిరుమల స్వామిని దర్శించుకున్నాక మనసు కూడా ఎంతో ఉల్లాసంగా, ప్రశాంతంగా, పాజిటివ్ గా అనిపిస్తుంది. అందుకే కాబోలు తిరుమలకు జనాలు క్యూ కడుతుంటారు. అయితే కేవలం శ్రీవారిని దర్శించుకోవడానికే లక్షల మంది తిరుమలకు వెళ్తుంటారు. కానీ తిరుమల శ్రీవారి ఆలయం గురించి మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విష‌యాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

do know these things about Tirumala temple

టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) అనే ఓ స్వతంత్ర సంస్థ నేతృత్వంలో తిరుమల ఆలయ నిర్వహణ కొన‌సాగుతుంది. టీటీడీలో దాదాపుగా 15వేల‌ మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. టీటీడీ కింద తిరుమల ఒక్కటే కాదు.. మొత్తం 12 ఆలయాలు ఉన్నాయి. 1830 సమయంలోనే తిరుమలలో భక్తులు చెల్లించే కానుకల నుంచి ఈస్టిండియా కంపెనీకి ఏడాదికి రూ.1 లక్ష దాకా పన్ను వచ్చేదట. తిరుమల గుడిలో దాదాపు 11 టన్నుల స్వర్ణాభరణాలు ఉన్నాయని తెలుస్తోది.

ఇక స్వామి వారికి వాడే 108 బంగారు పువ్వులను గుంటూరు జిల్లాకు చెందిన షేక్ హుస్సేన్ సాహెబ్ అనే ముస్లిం శ్రీవారికి సమర్పించాడు. తిరుమలలో శ్రీవారికి ప్రతి గురువారం నైవేద్య సమయంలో తిరుప్పావడ జరుగుతుంది. తిరుప్పావడ అంటే సుమారు 450 కిలోల అన్న ప్రసాదం, లడ్డు, వడ, దోశ‌, పాయసం, జిలేబీ తదితర పిండివంటలను శ్రీవారికి నైవేద్యంలా సమర్పిస్తారు. దీన్ని ఎంతో వైభ‌వంగా నిర్వ‌హిస్తారు. ఇక 1983లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత భక్తుల కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ను నిర్మించారు. దీని ద్వారానే నిత్యం వేల సంఖ్య‌లో భ‌క్తులు శ్రీ‌వారిని ద‌ర్శించుకుంటుంటారు. ఇలా తిరుమ‌ల ఆల‌యం ఎన్నో విశిష్ట‌త‌ల‌ను క‌లిగి ఉంది.

Share
editor

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago