Sushanth : భోళా శంక‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవికి అదిరిపోయే రియాక్ష‌న్ ఇచ్చిన‌ సుశాంత్

Sushanth : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్‌’ చిత్రానికి. మెహర్ రమేష్ దర్శకత్వం వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషించారు. అనిల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌‌ను నిర్మించారు. ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్ర‌మోష‌న్‌లో సుశాంత్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. లో ఏదీ తాను ప్లాన్ చేసింది కాదని చెప్పిన సుశాంత్.. హీరో, గెస్ట్ రోల్, సపోర్టింగ్ రోల్ ఇలా అన్నీ తనకు నచ్చిన పాత్రలే చేస్తున్నానని చెప్పారు.

‘అల వైకుంఠపురములో’ చిత్రంలో బన్నీ, త్రివిక్రమ్‌తో పని చేశానని.. చాలా కొత్తగా చూపించారని అన్నారు. వాళ్ల దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాని తెలిపారు. అలాగే ‘రావణాసుర’లో కూడా డిఫరెంట్‌గా చూపించారన్నారు.చిన్నప్పటి నుంచీ చిరంజీవి సినిమాలు చూస్తూ ఆయనకి అభిమానులుగా పెరిగాం. చిన్నప్పటి నుంచీ ఆయన డ్యాన్స్ అంటే పిచ్చి. చిన్నప్పుడు ఆయన సాంగ్ షూటింగ్‌కి రెండు మూడు సార్లు వెళ్లాను. ఆయన డ్యాన్సులు చూస్తూ ప్రాక్టీస్ చేసేవాడిని. మెహర్ రమేష్ ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. చాలా నచ్చింది. అందులోనూ ఒక సాంగ్ కూడా ఉంటుందని చెప్పారు.

Sushanth fun in bhola shankar pre release event
Sushanth

మెగాస్టార్‌తో స్క్రీన్ పంచుకోవడమే ఒక అదృష్టం. ఆయనతో డ్యాన్స్ చేసే అవకాశం ఎంతమందికి దొరుకుతుంది. అందుకే మెహర్ రమేష్ చెప్పినప్పుడే చిరంజీవితో డ్యాన్స్ స్టెప్స్ ఉండాలని ఆయన దగ్గర మాట తీసుకున్నాను’ అని సుశాంత్ చెప్పుకొచ్చారు. ఇది బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా ఉండే మూవీ. ఇందులో నాది క్యామియో రోల్. నా పాత్ర చాలా ఛార్మింగ్‌గా ఉంటుంది. చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నాతో నాకు కీలకమైన సన్నివేశాలు ఉంటాయి. ఈ సినిమా షూటింగ్‌ని చాలా ఎంజాయ్ చేశా. నా మొదటి సినిమా హీరోయిన్ తమన్నా. భోళాలో మాత్రం బ్రదర్ సిస్టర్‌గా చేశాం. కీర్తి సురేష్‌తో సీన్స్ చేస్తునప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. చిరంజీవితో సీన్స్ చేస్తున్నపుడు మాత్రం చాలా ఎగ్జయిట్మెంట్ వచ్చింది. చిరంజీవిలోని ప్రత్యేక ఏమిటింటే.. అందరితో సరదాగా ఉంటూ జోక్స్ వేస్తూ అందరినీ కంఫర్ట్ జోన్‌లో ఉంచుతారు అని సుశాంత్ అన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

11 hours ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

15 hours ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 day ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

4 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

4 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

4 days ago