Kodali Nani : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు చాలా వాడివేడిగా సాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. దీనికి వైసీపీ నాయకులు ప్రతిస్పందిస్తూ విమర్శలు చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజులు వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘యాక్టర్ల రెమ్యూనిషన్‌పై ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడుతున్నాయి. పిచ్చుకలు మీద బ్రహ్మాస్త్రంగా ఫీల్మ్ ఇండస్ట్రీ పైన పడతారేంటి. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, ఉద్యోగ, ఉపాధి అవకాశల గురించి ఆలోచించాలి, పేదవారి కడుపు నింపే ఆలోచనలు చేయలంటూ’ ఏపీ ప్రభుత్వాని ఉద్దేశిస్తూ మాట్లాడిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో కొడాలి నాని స్పందిస్తూ దారుణమైన కామెంట్స్ చేశారు. ప్రభుత్వం ఎలా ఉండాలో సినిమా ఇండస్ట్రీలో చాలామంది పకోడీగాళ్లు సలహాలిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు . ‘మనకెందుకురా బాబు మన డ్యాన్సులు , ఫైట్లు మనం చూసుకుందామని వాళ్లకు కూడా సలహా ఇస్తే మంచిది’ అన్నారు. కొడాలి నాని మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటరిచ్చారు. ఈ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం నడిపింది చంద్రబాబేనని.. ఆ రోజు ప్రాజెక్టులు ఎందుకు పూర్తిచేయలేకపోయారో చెప్పాలన్నారు.
తెలంగాణలో మహబూబ్ నగర్‌ను దత్తత తీసుకుంటానని చెప్పి ఎందుకు గాలికొదిలేశారని ప్రశ్నించారు. చంద్రబాబు 27 ఏళ్లలో బాబు గుడ్డి గుర్రం పళ్లు తోమారా అంటూ సెటైర్లు పేల్చారు. ఈ రాష్ట్రంలో జలయజ్ఞం చేపట్టిన వ్యక్తి వైఎస్సార్.. గడచిన పదేళ్లలో కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు ఏం చేశారో చెప్పాలన్నారు. చంద్రబాబుకు 2024 ఎన్నికలే చివరి ఎన్నికలని.. ఆ తర్వాత ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదన్నారు. జనసేన ఒక కామెడీ పార్టీ.. అది జనసేన కాదు జనసున్నా పార్టీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీచేసి నాలుగుచోట్ల ఓడిపోగలరని.. చంద్రబాబు సేవ చేయడానికే పవన్ జనసేన పెట్టారని ధ్వజమెత్తారు. జనసేనను భజనసేన చేశారని.. పవన్ మాటలు చూస్తే కోటలు దాటతాయన్నారు. వాడిని కొడతా.. వీడిని కొడతా.. బోడిగుండు కొట్టిస్తా అంటారని పవన్‌పై విరుచుకుపడ్డారు. ఈ రాష్ట్రంలో బోడిగుండుకొట్టించుకున్నది ఆయనేనని.. పవన్‌ను ఈ రాష్ట్ర ప్రజలు మోకాళ్ల మీద కూర్చోబెట్టారన్నారు. చంద్రబాబును సీఎం చేయడం పవన్ చేతుల్లో ఉంటుందా అన్నారు నాని.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…