Suresh Raina : వరల్డ్ కప్ 2023లో అదరగొట్టిన టీమిండియా ఫైనల్‌లో మాత్రం తేలిపోయింది. సరైన లక్ష్యాన్ని విధించలేక చతికిలపడిపోయింది. ఓటమి తర్వాత టీమిండియా ఆటగాళ్లతో పాటు ఓపెనర్ రోహిత్ శర్మని తిట్టిపోస్తున్నారు. వరల్డ్ కప్ ఓటమి గురించి టీమిండియా మాజీ స్టార్ సురేష్ రైనా కూడా మాట్లాడాడు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అద్భుతంగా కెప్టెన్సీ చేశాడని మెచ్చుకున్నాడు. ‘మ్యాచ్‌ను ఆసీస్ వైపు తిప్పింది కమిన్స్ కెప్టెన్సీనే. రోహిత్‌ను అవుట్ చేయడానికి మ్యాక్స్‌వెల్‌తో బౌలింగ్ వేయించడం చాలా తెలివైన నిర్ణయం. ట్రావిస్ హెడ్ క్యాచ్ కూడా సూపర్ అనే చెప్పాలి’ అని రైనా అన్నాడు.
అలాగే కోహ్లీని కమిన్స్ అవుట్ చేయడం కూడా అద్భుతమైన నిర్ణయానికి దక్కిన ఫలితమే. ఆసీస్ జట్టు భారత్ కన్నా మెరుగ్గా ఆడింది. అలాగే వాళ్ల ప్లానింగ్ కూడా సూపర్‌గా ఉంది’ అని రైనా మెచ్చుకున్నాడు. అంతేకాదు, ఆసీస్ ఫీల్డింగ్ చాలా అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఆసీస్ ఆటగాళ్ల డైవ్‌లు, అద్భుతమైన స్టాప్‌లు సూపర్ అని కితాబిచ్చాడు. ఆసీస్ సూపర్ ఫీల్డింగ్ వల్ల ఆసీస్ కనీసం 30-40 పరుగులు కట్టడి చేయగలిగింది. మొదటి బంతి నుంచే సింగిల్స్, బౌండరీలు ఆపుతూ వచ్చారు. ట్రావిస్ క్యాచ్ ఒక్కటే కాదు, డీప్‌లో వార్నర్, లబుషేన్ కూడా సూపర్ ఫీల్డింగ్ చేశారు’ అని రైనా చెప్పుకొచ్చాడు. కెప్టెన్సీలో కూడా కమిన్స్ తన టెంపర్‌మెంట్ చూపించాడని మెచ్చుకున్నాడు.
‘ప్రతి భారత బ్యాటర్ మీద ఒత్తిడి పెట్టడంలో కమిన్స్ సక్సెస్ అయ్యాడు అని రైనా అన్నాడు. భారత బ్యాటర్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నా కూడా ఒత్తిడి పెట్టారంటే కమిన్స్ తెలివితేటలే కారణం. అతని వ్యూహాలే ఈ మ్యాచులో రెండు జట్ల మధ్య తేడా. అతని ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ చాలా అద్భుతం’ అని రైనా కితాబిచ్చాడు. ఇక ఇదిలా ఉంటే రాంచీలో చెన్నై సూపర్ కింగ్స్ రీయూనియన్ జరిగింది. భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని విందు ఇవ్వడంతో పలువురు ఐపీఎల్ చెన్నై జట్టు ఆటగాళ్లు పాలుపంచుకున్నారు. భారత క్రికెట్ దిగ్గజం ధోనీని సురేశ్ రైనా కలుసుకోవడంతో ‘చిన్న తాలా, పెద్ద తలా’లను ఒకే ఫ్రేమ్ లో చూసే అవకాశం అభిమానులకు మరోసారి లభించింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…