Suman : ప్రస్తుతం ఏపీలో రాజకీయం చాలా వాడి వేడిగా సాగుతుంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా వైసీపీ నాయకులు ప్రత్యర్ధులపై దారుణమైన విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో సుమన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. సుమన్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ మూడు కాకపోతే ముప్పై పెళ్లిళ్లు చేసుకుంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. మాటిచ్చి తప్పే వ్యక్తులకి ఓటేయోద్దని ఆయన అన్నారు. రజనీకాంత్‌ని టార్గెట్ చేసి మాట్లాడడం కూడా బాధ కలిగించిందని అన్నారు. చిరంజీవి అన్న దాంట్లో తప్పేముంది.. సిన ఇండస్ట్రీకి, రాజకీయాలకి సంబంధం ఏముందని సుమన్ స్పష్టం చేశారు.
పవన్ పెళ్లి చేసుకున్న వారికి లేని బాధ వారికెందుకో అర్ధం కావడం లేదు.వచ్చే ఎన్నికలలో ప్రజలు విజ్ఞతతో వ్యవహరించాలి. చంద్రబాబు చాలా విజన్ ఉన్న వ్యక్తి అని సుమన్ అన్నారు సినీ పరిశ్రమలోని వారు పకోడి గాళ్లు కాదు, అలా విమర్శించిన వారు బజ్జీగాళ్లు అని సుమన్ స్పష్టం చేశారు. ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది చంద్రబాబే అని ఆయన స్పష్టం చేశారు. ఆయన రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు సరైంది కాదని అన్నారు. రాజకీయాలతో సంబంధం లేని రజినీకాంత్ పై ఎందుకు బురదజల్లుతున్నారని ప్రశ్నించారు. మేమెన్ని కష్టాలు పడతామో మీకు తెలుసా అని ఆయన విమర్శించారు సుమన్.
గో మహాపాదయాత్రలో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవని, ప్రజలందరి క్షేమం కోరి తాను ఈ కార్యక్ర మానికి సంఘీభావం తెలిపానని సుమన్ చెప్పారు.అఖిల భారత గోసేవ ఫౌండేషన్ అధ్యక్షుడైన బాలకృష్ణ గురుస్వామి మాట్లాడుతూ కలుషి తమైన ఈ భూమిని బాగుపరచాలంటే ఆవు మూత్రం, పేడ తప్పితే ప్రపంచంలో ఏ వస్తువూ ఉపయోగపడదన్నారు. గోవులు అన్ని మతాలు, కులాల వారికి అవసరమని పేర్కొన్నారు. అలిపిరి కాలినడకన తిరుమల చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటా మని, ఆ తర్వాత శ్రీవారిమెట్టు ద్వారా కిందకు దిగి తమిళనాడు అరుణాచలానికి పయనమవుతామని అన్నారు. ఈనెల 31న గో మహాపాదయాత్రకు ముగింపు పులుకుతామని సుమన్ తెలిపారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…