Sri Reddy : వివాదాస్పద నటి, యూట్యూబర్ శ్రీరెడ్డి .. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరురాలు అన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ తన పూర్తి మద్దతు అంటూ శ్రీరెడ్డి తెగ చెబుతూ ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే ఆమె టీడీపీ, జనసేన నాయకులపై కూడా తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటుంది. ఇన్‌డైరెక్ట్ పేర్లతో చంద్రబాబు, ఉండవల్లి శ్రీదేవి, మహాసేన రాజేష్, పవన్ కళ్యాణ్ లోకేష్‌లపై బూతుల పంచాంగం విప్పింది. శ్రీరెడ్డి ఈ రేంజ్‌లో తిట్టడం మొదటి సారు కాదు. వైసీపీపై విమర్శలు చేసినప్పుడల్లా తను ఇలాంటి మాటలు మాడుతూ వైసీపీని గెలిపించాలని, ఆ పార్టీకి అండగా ఉండాలని కోరుతుంది.
తెలుగు సినిమా పరిశ్రమలో నటిగా రాణించాలనే లక్ష్యంతో ప్రయత్నించిన యాంకర్, న్యూస్ రీడర్ శ్రీరెడ్డి తనకు జరిగిన అన్యాయాలను మీటూ ఉద్యమంతో బయట పెట్టి సంచలనం రేపారు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి చెన్నైకి మకాం మార్చిన ఆమె ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ వస్తున్నారు. అప్పట్లో మాకు నెలవారీ జీతాలు చెల్లించడం లేదంటూ విడుదల చేసిన వీడియో వైరల్ అయింది. వైసీపీ కోసం ఇంత కష్టపడి పనిచేస్తున్న తనను ఇప్పటి వరకు ఎవ్వరూ గుర్తించలేదని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా వైఎస్సార్‌సీపీ అమ్మాయి అని కూడా నన్నెప్పుడూ గుర్తించలేదు అన్న. మిమ్మల్ని తిట్టేవాళ్లకేమో మీరు ఎమ్మెల్యేలు, ఎంపీ పదవులు ఇచ్చి అందలాలు ఎక్కించారు అన్న. కానీ, నాలాంటి వాళ్లను మాత్రం మీరు పట్టించుకోలేదన్న. దయచేసి మమ్మల్ని గుర్తించాలని కోరింది.
నేను యూట్యూబర్‌గా ఉన్నప్పుడు డబ్బులు సంపాదించుకొన్నాను. కానీ కొన్ని నెలలుగా మీ కోసం నేను పనిచేస్తున్నాను. ఎప్పటి నుంచి మీ కోసం పనిచేస్తున్నాననో అప్పటి నుంచి నేను కష్టాలు పడుతున్నాను. వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తున్న నన్ను గుర్తించలేదు. కానీ మిమ్మల్ని తిట్టే వారిని అందలాలు ఎక్కించారు అన్న. దయచేసి మాకు గుర్తింపు ఉండేలా చేయాలి. మాకు జీతాలు ఇవ్వాలని కార్యకర్తల తరఫున కోరుతున్నాను. మా కష్టాలు గుర్తించి.. రోడ్లపైకి వచ్చిన మమ్మల్ని ఆదుకోవాలి. లేకపోతే ఏం జరుగుతుందో చెప్పలేం అంటూ శ్రీరెడి ఘాటుగానే స్పందించింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…