Sreeleela : అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రీలీల. పెళ్లి సందD చిత్రంతో మోస్ట్ పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ తర్వాత ధమాకా సినిమాతో తన ఖాతాలో వేసుకుంది దీంతో ఆమెకు వరుసగా సినీ అవకాశాలు చెంత చేరాయి. మొత్తంగా శ్రీలీల చేతిలో 7 భారీ చిత్రాలు ఉన్నట్టు తెలుస్తుంది. స్టార్ హీరోలంతా కూడా ఆమెనే ఎంచుకుంటున్నారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇలా స్టార్ హీరోలంతా కూడా శ్రీలీలకే ఓటేస్తున్నారు. అలా శ్రీలీల పేరు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది.
శ్రీలీల డ్యాన్సులకు అంతా ఫిదా అవ్వాల్సిందే. సాయి పల్లవి తరువాత ఈ తరం హీరోయిన్లలో శ్రీలలకే మళ్లీ ఆ రేంజ్ క్రేజ్ వచ్చింది అని చెప్పాలి. శ్రీలీల వేసే స్టెప్పులు, గ్రేస్‌తో చేసే డ్యాన్స్‌కు అంతా ఆశ్చర్యపోతోంటారు. ధమాకా సినిమాలో రవితేజతో కలిసి శ్రీలీల చేసిన డ్యాన్స్‌లు బాగానే వైరల్ అయ్యాయి. అది వంద కోట్ల క్లబ్బులో చేరడానికి శ్రీలీల కూడా కారణం. అలా వంద కోట్ల భామగా శ్రీలీలకు టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఇక శ్రీలీల సైమా 2022 వేడుకలో వేసిన డ్యాన్స్ ఇప్పటికీ ఎవరు మరచిపోరు.పుష్ప సినిమాతో పాటు పలు సినిమాలలోని సాంగ్స్ కి ఈ అమ్మడు డ్యాన్స్ చేసి రచ్చ లేపింది.
శ్రీలీల డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ అమ్మడి అందచందాలతో పాటు క్యూట్ డ్యాన్స్ కి కూడా ఫిదా అవుతున్నారు. శ్రీలీల ప్రస్తుతం రామ్ పోతినేని, నితిన్, విజయ్ దేవరకొండ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లాంటి హీరోలతో నటిస్తోంది. అలాగే మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న SSMB28లో కూడా అవకాశం అందుకుంది. మొత్తంగా శ్రీలీల చేతిలో 7 భారీ చిత్రాలు ఉండగా, ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ల తరహాలో వరుస అవకాశాలతో బిజీగా మారిపోయింది. ఈ ముద్దుగుమ్మ రెమ్యునరేషన్ కూడా భారీగానే డిమాండ్ చేస్తుందని టాక్.