Ahimsa Movie Song : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చిన్న కుమారుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా, తేజ తెరకెక్కించిన చిత్రం అహింస. ఈ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ దారుణమైన పరాజయాన్ని చవి చూసింది. చిత్రంలో కథానాయికగా కనిపించిన గీతిక తివారికి కూడా ఇది మొదటి సినిమా కాగా, చిత్రంలో బలమైన కంటెంట్ ఉంటుందని ఆడియన్స్ భావించారు. అయితే ఈ సినిమా మాత్రం ఆ నమ్మకానికి చాలా దూరంగానే ఆగిపోయింది. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ కాస్త ప్లస్ అయిందని చెప్పాలి. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఫస్ట్ సింగిల్ ‘నీతోనే నీతోనే’ పాటని విడుదల చేశారు.
ఇది శ్రోతలని ఎంతగానో ఆకట్టకుంది. ఆర్‌పి పట్నాయక్ ఈ పాటని మనసుని హత్తుకునే మెలోడిగా కంపోజ్ చేశారు. సిద్ శ్రీరామ్ తన బ్రిలియంట్ వాయిస్‌తో మెస్మరైజ్ చేయగా, సత్య యామిని వాయిస్ పాటకు మరింత మాధుర్యాన్ని ఇచ్చింది. ఈ పాటకు చంద్రబోస్ అందించిన సాహిత్యం మళ్ళీ మళ్ళీ పాడుకునేలా ఆకట్టుకుంది. ఇందులో గ్లామర్ షో కూడా పీక్స్ లో ఉంది. హీరో, హీరోయిన్ రొమాన్స్ కూడా అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
వెండితెరపై వైవిధ్యమైన ప్రేమకథలని ఆవిష్కరించి ఘన విజయాలని సాధించిన క్రియేటివ్ జీనియస్ తేజ, అభిరామ్ అరంగేట్రం చేస్తున్న యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అహింస ‘తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మి్ంచారు.. ఈ చిత్రంలోని ‘నీతోనే నీతోనే’, ‘కమ్మగుంటదే’ పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫర్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ కాగా, అనిల్ అచ్చుగట్ల డైలాగ్స్ అందించారు . సుప్రియ ఆర్ట్ డైరెక్టర్. ఈ చిత్రంలో సిల్లీ సీన్స్ కారణంగా కథతో .. ఎమోషన్స్ తో ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు. అందువల్లనే ఈ సినిమాను మొదటి నుంచి చివరివరకూ ఓపికగా చూడటం తమ వలన కావడం లేదని అన్నారు.