Ambati Rayudu : అంబటి తిరుపతి రాయుడు.. క్రికెట్‌పై అవగాహన ఉన్న ప్రతీఒక్కరికి ఈ పేరు సుపరిచితమే. తెలుగు వాడిగా టీమిండియా క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు పొందిన ఇతను … పలుసార్లు టీమిండియా గెలుపులోనూ కీలక పాత్ర పోషించారు. ఐపీఎల్ -2023లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అంబటి రాయుడు.. ఇదే తనకు చివరి టోర్నీ అని అన్నాడు. ఇక ఇటీవల తాను ఏపీ రాజకీయాలలోకి వస్తున్నట్టు వార్తలు రాగా, దానిపై స్పందించిన అంబటి.. ఏపీ రాజకీయాలపై తనకు ఆసక్తి ఉందని, తన కుటుంబ సభ్యులు, స్నేహితులు తన నిర్ణయానికి మద్దతు ఇస్తున్నారని రాయుడు వెల్లడించారు.అంబటి రాయుడు హైదరాబాద్‌లో పెరిగారు. అయితే, అతను పుట్టింది ఏపీలోని గుంటూరు జిల్లాలో. అందుకే అంబటి ఏపీ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది.
ఇటీవల సిద్దిపేట స్టేడియంలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ సీజన్ 3 ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, హీరో నాని, క్రికెటర్ అంబటి రాయుడు పాల్గొన్నారు. నానిని, అంబటి రాయుడుని చూసేందుకు క్రీడాకారులు, అభిమానులు పెద్దఎత్తున సిద్దిపేట క్రికెట్ స్టేడియానికి వచ్చారు. అయితే.. ఈ కార్యక్రమంలో మాట్లాడిన అంబటి రాయుడు.. తాను సీఎం కేసీఆర్‌కు పెద్ద ఫ్యాన్‌ని అని చెప్పుకొచ్చాడు. సిద్దిపేటకి రావడం చాలా సంతోషంగా ఉందన్న రాయుడు.. 10 ఏళ్లలో ఇండియాలో జరగని అభివృద్ధి సిద్దిపేటలో జరిగిందని ప్రశంసించారు. ఇండియా టీంలో తెలుగు వాళ్లు చాలా మంది ఆడాలని ఆకాంక్షించాడు. సిద్దిపేటలో క్రికెట్ కోచింగ్ సెంటర్ ప్రారంభించాలని మంత్రి హరీష్ రావుని అంబటి రాయుడు కోరారు.
అయితే అంబటి రాయుడు తెలుగులో మాట్లాడుతున్నంత సేపు చాలా ఆసక్తిగా తిలకించాడు నాని. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఏకరంన్నర భూమి ఇచ్చాడు అంబటి రాయుడు. ఇప్పుడు అదే కాళేశ్వరం నీళ్లతో వ్యవసాయం చేస్తున్నాడు. అయితే చదువుకున్న యువత మార్పు తీసుకురావడానికి రాజకీయాల్లోకి రావాలని, ఈ ఆలోచనే నన్ను ఈ నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించిందని రాయుడు చెప్పారు. అయితే, అతను ఇప్పట్లో క్రికెట్ నుంచి రిటైర్ కావాలని అనుకోవటం లేదట. ఐపీఎల్ లో ఎక్కువ కాలం సేవలందించిన క్రికెటర్లలో అంబటి రాయుడు ఒకరు. ఐపీఎల్ లో 190కిపైగా మ్యాచ్ లు ఆడారు.