Rana Daggubati : జూన్ 2 థియేటర్లలో రిలీజ్ అయి ప్రేక్షకులని అలరించిన మూవీ పరేషాన్ . తిరువీర్, పావని లీడ్ రోల్స్ లో రూపక్ రొనాల్డ్ సన్ తీసిన ఈ సినిమాను దగ్గుబాటి రానా ప్రజెంట్ చేసారు. ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ ప్రమోషన్ కోసం చిత్ర యూనిట్ బాగానే కష్టపడింది. రానా తన సినిమా ప్రమోషన్ కోసం గంగవ్వని కలిశాడు.ఈ సందర్భంగా రానాతో కల్లు తాగించి రచ్చ రచ్చ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇక అలానే సినిమా రిలీజ్ కి ముందు ప్రీ రిలీజ్ దావత్ అంటూ పలువురు సెలబ్రెటీలను తీసుకొచ్చి ధూమ్ ధాం చేశారు. ఈ సందర్భంగా యాంకర్ ఝాన్సీ జాతి రత్నాలు ఫేం అనుదీప్‌ని పలు ప్రశ్నలు అడిగింది.
ఇక్కడున్న వారిలో మీరు ఎవరిని చూసుకున్నారు అని ప్రశ్నించగా, దానికి అనుదీప్ ఏదేదో సమాధానం చెప్పాడు. మీరు ఇక్కడి వారిని అడిగితే వాళ్ల తాతల వరకు వెళ్లారు. అయితే అనుదీప్ చెప్పిన సమాధానాలు మాత్రం ప్రతి ఒక్కరిని ఎంతగానో నవ్వించాయి. చాల కూల్ గా మనోడు వేసిన పంచ్‌లకి అందరు నవ్వుకున్నారు. ఇక పరేషాన్ విషయానికి వస్తే ఈ సినిమా భాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కవుట్ కాలేదు. సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటిలో చూద్దామని చాలా మంది ఫిక్స్ అయ్యారు. ఈ నేపధ్యంలో ఓటిటిలో ఎప్పుడు రానుంది అని అందరు ఎదురు చూస్తున్నారు.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ఈ కామెడీ ఎంటర్టైనర్ డిజిటల్ హక్కులను సోనీ లివ్ సొంతం చేసుకుంది. ఎగ్రిమెంట్ ప్రకారం సినిమా హిట్ అయితే నెల రోజుల తర్వాత ఓటిటిలోకి వస్తుంది. కానీ ఈ సినిమా రిజల్ట్ బట్టి చూస్తుంటే పది హేను రోజులు లోపే సినిమా ఓటిటిలో వచ్చేస్తుందని చెప్తున్నారు. “పరేషాన్” చిత్రంలో అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్ వరకు పర్వాలేదనిపిస్తుంది. అలాగే తిరువీర్ మంచి నటన కనబరిచాడు. అయితే ఇంట్రస్టింగ్ గా సాగని సెకండాఫ్, నవ్వు తెప్పించని కొన్ని కామెడీ సీన్స్ విసిగిస్తాయి. దీనితో ఈ చిత్రం జస్ట్ రొటీన్ యావరేజ్ ఫ్లిక్ గా నిలిచిపోయింది.