Venkatesh Wife Neeraja : దగ్గుబాటి హీరో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామానాయుడి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వెంకటేష్ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మనసులని గెలుచుకున్నారు. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్న వెంకటేష్ కి టాలీవుడ్ లోని టాప్ హీరోలలో ఒకరిగా పేరు ఉండటమే కాకుండా ఫ్యామిలీ సినిమాల స్పెషలిస్ట్ గా కూడా పేరుంది. ఒకప్పుడు ఆయన సినిమాలు వస్తున్నాయంటే కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కారణంగా అవి హిట్ అవుతాయని నమ్మకం అందరిలో ఉండేది. చాలా కాలం నుంచి సినీ పరిశ్రమలో ఉన్నప్పటికీ ఆయన గురించి ఒక్క గాసిప్ కానీ వివాదం కానీ లేదు.
వెంకటేష్ చాలా సైలెంట్‌గా కాబట్టే ఆయన పర్సనల్ లైఫ్ గురించి కూడా పెద్దగా ఏ విషయాలు బయటకు రావు. వెంకటేష్ భార్య పేరు నీరజా రెడ్డి కాగా వీరిది చిత్తూరు జిల్లాలోని మదనపల్లె. ఆమె తల్లిదండ్రులు వెంకటసుబ్బారెడ్డి, ఉషారాణి. వీరిది అప్పట్లోనే జమీందారీ కుటుంబం. వందలాది ఎకరాల భూమితో సహా రైస్ మిల్లులు, పలు ఫ్యాక్టరీలు కాకుండా అంగ అనేక రకాల వ్యాపారాలు కూడా ఉండేవి. ఇండస్ట్రీలో హీరోగా వెంకటేష్ నిలదొక్కుకుంటున్న సమయంలో ఆయనకు పెళ్లి చేయాలని రామానాయుడు నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే మంచి సంబంధం ఉంటే చెప్పాలని విజయ అధినేత నాగిరెడ్డికి చెప్పడంతో.. నీరజారెడ్డి కుటుంబం గురించి నాగిరెడ్డి .. రామానాయుడికి చెప్పారట.
![Venkatesh Wife Neeraja : వెంకటేష్ భార్య నీరజా రెడ్డి ఎవరు.. ఆమె ఎందుకు బయటకి రారు..! Venkatesh Wife Neeraja why she does not appear in public](http://3.0.182.119/wp-content/uploads/2023/06/venkatesh-wife-neeraja.jpg)
నాగిరెడ్డి సూచన మేరకు ముందుగా రామానాయుడు మదనపల్లి వెళ్లి తొలుత నీరజారెడ్డిని చూడగా, వారి కుటుంబం, అమ్మాయి కూడా బాగా నచ్చడంతో వెంకటేష్ ను పిలిపించి చూపించారు. ఇద్దరికి ఒకరినొకరు నచ్చడంతో 1989లో వెంకటేష్ , నీరజారెడ్డి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వెంకటేష్ – నీరజారెడ్డి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. ఆశ్రిత రెడ్డి, హయ వాహిని, భావన, అర్జున్. వీరిని మీడియాకు , సినీ ప్రపంచానికి దూరంగా ఉంచుతున్నారు వెంకటేష్.నీరజాకి కూడా బయట ప్రపంచంలో తిరగడం పెద్దగా ఇష్టం ఉండదు. అందుకే సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ వెళుతుంది.