Sreeja Konidela : చిరంజీవి చిన్న కూతురు శ్రీజ సినిమాలలోకి రాకపోయిన కూడా ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. శ్రీజ కొణిదెల విడాకులకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఏదో ఒక ప్రచారం నడుస్తూనే ఉంది.మొదటగా శ్రీజ తన సోషల్ మీడియా ఖాతాల నుండి కళ్యాణ్ దేవ్ పేరు తొలగించడంతో ఆమె విడాకుల ఇష్యూ తెరపైకి రాగా, కొన్నాళ్లుగా మెగా ఫ్యామిలీ ఈవెంట్స్ లో కళ్యాణ్ దేవ్ కనిపించకపోవడంతో వీరిద్దరి విడాకుల రూమర్స్ పెద్ద ఎత్తున హాట్ టాపిక్‌గా మారాయి. అంతేకాదు వీరు పెట్టే సోషల్ మీడియా పోస్ట్‌లు కూడా నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. అయితే ప్రస్తుతం శ్రీజ ఫ్యాషన్ షోతో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రీతమ్ జుకల్కర్ అనే ఫ్యాషన్ డిజైనర్‌తో శ్రీజ దిగిన పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. సమంతకే కాకుండా ప్రీతమ్ ఇంకా స్నేహా రెడ్డి, శ్రీజ కొణిదెలకు డిజైనర్‌గా వ్యవహరిస్తుంటాడు. ప్రీతమ్ తాజాగా శ్రీజ ప్రీతమ్ కలిసి కనిపించారు. వీకెండ్ పార్టీలో వీరంతా సందడి చేసినట్టుగా ఉంది .శ్రీజ ధరించిన దుస్తులని ప్రీతమ్ స్పెషల్ గా డిజైనట్ చేసినట్టు టాక్. బ్లాక్ శారీలో షోల్డర్ వరకు ఉన్న జాకెట్ ధరించి శ్రీజ సరికొత్త లుక్‌లో కనిపించి ఔరా అనిపించింది. ప్రస్తుతం శ్రీజ సన్నింగ్ లుక్స్ మాత్రం నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.
ఇక శ్రీజ విషయానికి వస్తే ఈ అమ్మడు శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని మొదట పెళ్లి చేసుకొని పాప పుట్టిన తర్వాత అతనికి విడాకులు ఇచ్చింది.అనంతరం కళ్యణ్ దేవ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అతనికి శ్రీజకి నవిష్క అనే కూతురు జన్మించింది. అయితే శ్రీజ ఇప్పుడు కళ్యాణ్ దేవ్‌కు దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. తమ మధ్య పెరిగిన దూరానికి, విడాకుల వరకు వచ్చిన విషయాన్ని ఇంత వరకు అధికారికంగా అయితే ఎక్కడా ప్రకటించలేదు. కానీ శ్రీజ మాత్రం తన ఫ్రెండ్స్‌తో తిరుగుతూ ఫుల్ చిల్ అవుతోంది.