Sr NTR : సీనియ‌ర్ ఎన్టీఆర్ చ‌నిపోయే కొన్ని గంట‌ల ముందు ఏం జ‌రిగిందో తెలుసా..?

Sr NTR : విశ్వ విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు భౌతికంగ మ‌న మ‌ధ్య‌న లేక‌పోయిన ఆయ‌న జ్ఞాప‌కాలు ఇప్ప‌టికీ మ‌న క‌ళ్ల ముందు క‌ద‌లాడుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో ఓ సంచలనం సృష్టించిన గొప్ప నటుడు .ఆయ‌న పేరు వింటేనే మనసులో ఏదో తెలియని చలనం వస్తుంది. తెలుగు ప్రజలు ఇప్పటికీ ఆయన్ని అన్నగారు అని అభిమానంగా పిలుచుకుంటారు. ఇకపోతే ఎన్టీఆర్ జీవితంలో జరిగిన అత్యంత విషాదకరమైన ఘటన వెన్నుపోటు అని చాలా మంది చెబుతూ ఉంటారు.వాటికి సరైన ఆధారాలు మాత్రం ఎవరికి తెలియవు. అయితే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు.. చాలామంది రాజకీయ నాయకులు చాలా రకాల విమర్శలు చేశారు.

రాజకీయం అంటే ముఖానికి రంగు వేసుకోవడం కాదు అని అన్నారు. దానికి ఎన్టీఆర్ సమాధానమిస్తూ ‘నిజమే… అందుకే, నేను రాజకీయాల్లో రంగులు వేసుకోను’ అన్నారు నవ్వుతూ. ఆ మాట ప్రకారమే తనకు రాజకీయ రంగు అంటకుండా నిక్కచ్చిగా ఖచ్చితత్వంతో ఎన్టీఆర్ రాజకీయాలు చేశారు. ఆ ముక్కుసూటి తనమే ఆయనకు శాపం అయింది. ఇకపోతే అప్పటి జర్నలిస్ట్ తిప్పరాజు రమేష్ బాబు అనే వ్యక్తి ద్వారా ప్రస్తుతం ఆ చివరి గంటలో ఏం జరిగింది అనే విషయాలు సంచలనంగా మారుతున్నాయి. జనవరి 17న బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 13 లో ఉన్న ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్లానని ఆయన అన్నారు.

Sr NTR death what really happened at that night
Sr NTR

సాయంత్రం 5:00 అయింది.అన్నగారి ముఖంలో తీవ్రమైన ఆందోళన.అలాగే 6:00 కూడా అయ్యింది.తెలుగుదేశం పార్టీ అధికార అడ్వకేట్లు జాస్తి చలమేశ్వర్ ఎస్.వి.రమణ శ్రీనివాసరావు, అన్న గారి దగ్గరికి వచ్చినపుడు, ఎన్టీఆర్ ఏమైంది బ్రదర్స్ అని అనగానే దానికి వాళ్లు సమాధానంగా సర్ హైకోర్టులో మనం కేసు ఓడిపోయాం.తెలుగుదేశం బ్యాంకు ఖాతాలు అన్నీ చంద్రబాబు పార్టీకి చెందుతాయని బ్యాంకుల్లో మీ సంతకాలు చెల్లవని తీర్పు వచ్చినట్టు వాళ్ళు తెలిపారు.ఆందోళనకు గురైన ఎన్టీఆర్ ఒక్కసారిగా లేచి దరిద్రులు, చెండాలులు అని అరిచారట. ఆదరించి మంత్రిని చేస్తే ఇంత అన్యాయం చేశారు అని బోరున విలపించారట.

అలాగే తన బెడ్రూమ్ లోకి వెళ్లిపోయారట. ఇక లోపల గడియ పెట్టుకున్నారు.తాను, లక్ష్మీపార్వతి, అశోక్ ఎంత పిలిచినా తలుపు తీయలేదు. రాత్రి 8 గంటల సమయంలో తలుపు తీసి గదిలో ఉన్న వస్తువులన్నీ నేలకు కొట్టి జీవితంలో మోసపోయానని ఏడుస్తూనే ఉండిపోయారట. 1:00 వరకు ఆయన ఇంట్లోనే ఉన్నానని రమేష్ తెలిపారు.ఆ తర్వాత తాను ఇంటికి వెళ్లానని, ఇంటికి వెళ్ళిన కాసేపటికి లక్ష్మీ పార్వతి నుంచి ఫోన్ రాగానే మళ్ళీ వెంటనే తిరిగి ఎన్టీఆర్ గారి ఇంటికి వచ్చి చూసేసరికి చాలా దిగ్భ్రాంతికి లోనయ్యానని చెప్పారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago