Bobbili Puli : తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్, దాసరి నారాయణ రావు కాంబినేషన్‌లో వచ్చిన ‘బొబ్బలి పులి’ చిత్రం ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ఎన్టీఆర్ రాజకీయ వేదికగా పునాదిగా నిలిచింది. ఈ సినిమా విడుదల తర్వాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అందుకే ఎన్టీఆర్ అభిమానులకే కాదు.. సామాన్య ప్రేక్షకులకు కూడా బొబ్బలిపులి సినిమా అంటే ఓ తీపి జ్ఞాపకం అని చెప్పాలి. బొబ్బిలి పులి చిత్రం ఎన్టీఆర్, దాసరి కాంబోలో చివరి సినిమా కావడం విశేషం. ‘బొబ్బిలి పులి’ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోెడిగా శ్రీదేవి, జయచిత్ర నటించారు. ఈ చిత్రంలో శ్రీదేవి ప్రియురాలి పాత్రలో నటిస్తే.. జయచిత్ర భార్య పాత్రలో అలరించారు.
బొబ్బిలి పులి చిత్రానికి జేవి రాఘవులు అద్భుతమైన సంగీతం అందించారు. ఈ చిత్రంలోని పాటలన్ని సూపర్ హిట్. ముఖ్యంగా ఆర్మీ నేపథ్యంలో వచ్చే జననీ జన్మభూమి పాట అప్పటికీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ దేశ భక్తి గీతంగా నిలిచిపోయింది. ఈ చిత్రం ‘ఒకటో నెంబర్ బస్సు’, తెల్ల చీరలో’, యెడ్డమంటే, ఓ సుబ్బారావు, సంభవం పాటలు అన్ని మ్యూజికల్ ఛార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. అయితే బొబ్బిలి పులి సినిమాకి పోటీగా పలు సినిమాలు విడుదల అయ్యాయి. ఇందులో ముందుగా ఏఎనఆర్ నటించిన గోపాలక కృష్ణుడు సినిమా ఉంది.ఇందులో పాటలు విశేషంగా ఉంటాయి. ఇక ఈ సినిమా మంచి విజయం సాధించింది.
ఇక కృష్ణ నటించిన నివురుగప్పిన నిప్పు కూడా బొబ్బిలి పులి సినిమాకి విడుదలైంది.ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం ఫ్లాప్ గా నిలిచింది. ఇక బొబ్బలి పులి రిలీజ్ అయిన తర్వాత ఇది పెళ్లంటారా అనే సినిమా రిలీజైంది. చిరంజీవి హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి మెసేజ్‌తో వచ్చిన కూడా బొబ్బలి పులి ప్రభంజనానికి నిలవలేకపోయింది. చివరిగా చెప్పుకునే చిత్రం ప్రతీకారం. శోభన్ బాబు హీరోగా వచ్చిన ఈ చిత్రం బొబ్బలి పులి తర్వాతే విడుదలైన ఈ చిత్రం ఫ్యామిలీ డ్రామాగా రూపొంది మంచి విజయాన్ని సాధించింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…