Soniya Singh : మెగా హీరో సాయిధరమ్ తేజ్ కొద్ది పాటి గ్యాప్ తర్వాత నటించిన సినిమా విరూపాక్ష. ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అవుతున్న సందర్భంగా కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇదే క్రమంలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏలూరులో నిర్వహించారు. ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా సుకుమార్ కూడా హాజరయ్యారు. ఆయన సినిమాలో నిర్మాణ భాగస్వామ్యం కూడా అయ్యారు. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సీరియల్ యాక్ట్రెస్ సోనియా సింగ్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటించింది. సినిమాలో సుధ పాత్రలో సోనియా సింగ్ కనిపిస్తుంది.
సాధారణంగా సోనియా ఉంటే అక్కడ నవ్వులు పూస్తాయి. తనకు వచ్చీ రాని తెలుగుతో ఆమె ఏదైనా షోలో పాల్గొంటేనే కామెడీ కూడా అదిరిపోతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె స్టేజ్ మీద మాట్లాడిన తీరు కూడా అందరిని కడుపుబ్బా నవ్వించేలా చేసింది. హీరో సాయి ధరం తేజ్ తాను ఇంట్రావర్ట్ అంటూ మొదలు పెట్టిన సోనియా సింగ్ డైరెక్టర్ మనసు చాలా పెద్దదని అని చెప్పుకొచ్చింది. అయిఏ తను మాట్లాడుతున్నంత టైంలో సాయి ధరం తేజ్ నవ్వుతూనే ఉన్నాడు. పక్కన యాంకర్స్ శ్యామల హరి తేజ కూడా సోనియా సింగ్ స్పీచ్ ని కవర్ చేస్తూ నానా తిప్పలు పడ్డారు.
ఇక ఈ సినిమాలో తనకు ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ ప్రొడ్యూసర్ కు థ్యాంక్స్ చెప్పి స్పీచ్ ముగించింది సోనియా సింగ్. బుల్లితెర నటి అయిన సోనియా సింగ్ కావాలని అలా మాట్లాడుతుందో లేక ఆమె మాట్లాడటమే అలానో తెలియదు కానీ ఆమె మాట్లాడితే మాత్రం అక్కడ నవ్వులు పండాల్సిందే అని అంటున్నారు. . స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్ కి షిఫ్ట్ అయిన సోనియా సింగ్ ఇక్కడ కూడా రాణించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ నెల 21న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది.