Telugu Anchors : సినిమాకి ప్రమోషన్ చేయాలంటే, లేదంటే ఓ షోని మరింత రక్తి కట్టించాలంటే యాంకర్ అవసరం తప్పక ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీలోని యాంకర్లు కు విపరీతమైన క్రేజ్ ఉంది.. వీరు ఏ వేడుకలో నైనా సరే అందర్నీ ఆకర్షించే విధంగా తమ అందంతో పాటు చలాకీ మాటలతో ఆకట్టుకుంటూ ఉంటారు. తెలుగు ఇండస్ట్రీలో యాంకర్స్ గురించి మాట్లాడాల్సి వస్తే ముందుగా సుమ గురించి చెప్పుకోవాలి. ఇప్పటికీ ఎంతో చలాకీగా ఉన్న సుమ 1975 వ సంవత్సరం మార్చి 25న జన్మించింది.. ప్రస్తుతం ఆమె వయస్సు 48 సంవత్సరాలు.
ఇక పటాస్ షో తో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న యాంకర్ శ్రీముఖి .. మే 10 1993లో జన్మించిన శ్రీముఖి వయస్సు 30 సంవత్సరాలు. త్వరలోనే ఈ అమ్మడు పెళ్లి పీటలు ఎక్కనుంది. ఇక జబర్దస్త్ మరో హాట్ యాంకర్ రష్మీ.. ఈ ముద్దుగుమ్మ అ గ్లామర్ డోస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఈమె వయసు ఇప్పటికీ పెద్ద మిస్టరీ.. రష్మి 1988వ సంవత్సరం ఏప్రిల్ 27న జన్మించింది. ప్రస్తుతం ఈమె వయస్సు 35 సంవత్సరాలు అని తెలుస్తుంది. ఇక మరో ముద్దుగుమ్మ వర్షిణి ఏప్రిల్ 6, 1994లో జన్మించింది. ప్రస్తుతం ఆమె వయస్సు 29 సంవత్సరాలు. ఇక లాస్య ఆగస్ట్ 27, 1989లో జన్మించింది. ఈమె వయస్సు 34 సంవత్సరాలు.

మరో యాంకర్ ఉదయభాను ఆగస్ట్ 5 1973లో జన్మించింది. ఈమె వయస్సు 50 సంవత్సరాలు. యాంకర్ ఝాన్సీ జనవరి 16, 1975లో జన్మించింది. ఈమె వయస్సు 48 సంవత్సరాలు. యాంకర్ శ్యామల నవంబర్ 5 1989లో జన్మించింది.ప్రస్తుతం ఆమె వయస్సు 34 సంవత్సరాలు. ఇక మరో యాంకర్ విష్ణు ప్రియ ఫిబ్రవరి 22, 1990లో జన్మించింది. వయస్సు 33. శిల్పా చక్రవర్తి మే 15, 1985లో జన్మించింది. ఆమె ప్రస్తుత వయస్సు 38 సంవత్సరాలు. మంజూష జూన్ 12, 1990లో జన్మించింది. ప్రస్తుత వయస్సు 33. గాయత్రి భార్గవి జూన్ 2, 1984లో జన్మించింది. వయస్సు 39. హరితేజ ఫిబ్రవరి 26, 1989లో జన్మించగా ఆమె వయస్సు 34 సంవత్సరాలు. అనసూయ మే 15, 1985లో జన్మించగా ప్రస్తుత వయస్సు 38. ఇక జబర్ధస్త్ యాంకర్ సౌమ్యా రావు 1990 సెప్టెంబర్ 28న జన్మించగా ప్రస్తుత వయస్సు 33. ఇక యాంకర్ దేవి జూలై 12, 1991లో జన్మించగా ప్రస్తుత వయస్సు 32 సంవత్సరాలు.