Sobhan Babu : జయలలిత, శోభన్ బాబు ప్రేమ వ్యవహారంలో వాస్తవాలు ఎన్ని ఉన్నాయో తెలియదు గాని ఈ జంట గురించి మాత్రం మీడియాలో ఇప్పటికీ ఎన్నో వార్తలు వస్తు ఉంటాయి. అగ్ర హీరో, హీరోయిన్లు గా ఒకప్పుడు కెరీర్ లో పీక్ స్టేజ్ కి వెళ్ళిన ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని కాని అనుకున్న విధంగా పరిస్థితులు కలిసి రాక విడిగా ఉండిపోయారనే టాక్ నడిచింది. అసలు నిజంగా వీళ్లిద్దరి మధ్య ఏం జరిగిందనేది ఎవరికి తెలియదు. అయితే జయలలిత – శోభన్ బాబు ఒకరినొకరు ఎంతో ఇష్టపడ్డారు. వీరిది పవిత్ర ప్రేమ. అప్పటికే శోభన్ బాబుకు పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు.
శోభన్ బాబు తన గురువుగారి కుమార్తెను పెళ్లి చేసుకోగా, ఆ తర్వాత ఇండస్ట్రీలో స్టార్ హీరో అయ్యారు. ముఖ్యంగా అప్పటికే స్టార్ హీరోయిన్గా ఉన్న జయలలిత.. శోభన్ బాబును ఎంతో ఇష్టపడింది. శోభన్ బాబు లేకుండా ఆమె ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితికి వచ్చేసిందని అంటారు.. జయలలిత అంటే శోభన్ బాబుకి కూడా ఇష్టమే అయినప్పటికీ ఆమెను పెళ్లి చేసుకునేందుకు మాత్రం ఆసక్తి చూపేవారు కాదు. ఒకానొక దశలో జయలలిత – శోభన్ బాబును బెదిరించి నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని అనడంతో.. చివరకు శోభన్ బాబు అయిష్టంగానే ఆమెను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారని కొందరు చెబుతుంటారు.

జయలలిత శోభన్ బాబు హీరో హీరోయిన్ లుగా డాక్టర్ బాబు అనే సినిమా రాగా, వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఒకే ఒక్క సినిమా ఇది. అయితే ఈ సినిమా షూటింగ్ కి ముందు జయలలిత తల్లి మరణించడంతో ఆమెను శోభన్ బాబు ఎంతో పట్టించుకునేవారని , ఆ సమయంలోనే జయలలితకి శోభన్ బాబుపై ఇష్టం పెరిగిందని అంటారు. డాక్టర్ బాబు సినిమా షూటింగ్ ఊటీలో జరగగా శోభన్ బాబు జయలలిత గురించి ఆసక్తికరమైన విషయాలను తన డైరీలో రాసుకున్నారు. బరువైన నా మనసును నీ జోకులతో తేలిక చేశావు..ప్రపంచం అంతా ఇప్పుడు నిశ్చలంగా కనిపిస్తోంది. నా తల్లి మరణించి సంవత్సరం కూడా కాలేదు ఎన్నో సంవత్సరాలు అయినట్టు అనిపిస్తుంది. నా అనుకన్నవాళ్లు నన్ను మోసం చేశారు. బంధువులు డబ్బు కోసమే ఉన్నారు. ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మొద్దొ తెలియడం లేదు. ఇలాంటి ఎన్నో బాధలు మీరు వచ్చాక విముక్తి కలిగింది అంటూ జయలలిత తనతో చెప్పినట్టు శోభన్ బాబు డైరీలో రాసున్నారు. ఇది చూసిన తర్వాత చాలా మంది వారిద్దరి మధ్య ఉంది తల్లి తండ్రి లాంటి అనుబంధం అని చెప్పారు.