Sneha : తొలివలపు సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ స్నేహ. ఎక్కువగా ఫ్యామిలీ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులని మెప్పిస్తున్న స్నేహ… వెంకీ, ప్రియమైన నీకు, శ్రీరామదాసు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రముఖ తమిళ నటుడు ప్రసన్నని స్నేహ 2012లో వివాహం చేసుకుంది స్నేహ. ఈ దంపతులకి ఒక బాబు, పాప ఉన్నారు. వివాహం తర్వాత కూడా స్నేహ సినిమాల్లో నటిస్తోంది. కాకపోతే ఆమెకు హీరోయిన్ గా ఆఫర్స్ రావడం లేదు. స్నేహ తెలుగులో చివరగా వినయ విధేయ రామ చిత్రంలో కనిపించిన విషయం తెలిసిందే.
ఈ చిత్రంలో స్నేహ చరణ్ కు వదిన పాత్రలో నటించి మెప్పించింది. తన కెరీర్ లో స్నేహ ఎప్పుడూ హద్దులు దాటేలా గ్లామర్ షో చేసింది లేదు. చాలా పద్దతిగా కనిపిస్తూ ప్రేక్షకులని మెప్పించింది. అయితే కొద్ది రోజులుగా స్నేహాకి సంబంధించి తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చి సింగిల్‌గా ఉంటుందని, కొద్ది రోజులలో తమ విడాకుల విషయం కూడా అధికారికంగా ప్రకటిస్తారని అనే క వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్నేహా తప్పుడు వార్తలకు చెక్ పెట్టింది.తన భర్త ప్రసన్నతో సన్నిహితంగా ఉన్న ఓ పిక్‌ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీనిపై ట్వినింగ్ వీకెండ్ అంటూ రాసుకొచ్చింది.
ఈ విధంగా తన విడాకుల మ్యాటర్ అనేది రూమర్ మాత్రమే అనే కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసింది స్నేహ. 2009లో అచ్చముందు అనే సినిమాలో జంటగా నటించగా, ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించినట్టు తెలుస్తుంది… 2011లో పెళ్లి పీటలెక్కింది. ముచ్చటైన ప్రేమ పక్షులు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. . సోషల్ మీడియాలో యాక్టీవ్ రోల్ పోషించే స్నేహ అప్పుడప్పుడూ తన ఫ్యామిలీ ఫొటోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని పలకరిస్తూ ఉంటుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…