Sitara Ghattamaneni : సూపర్ స్టార్ మహేష్ బాబు సితార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలలోకి రాకపోయిన కూడా స్టార్ హీరోయిన్స్‌కి మించి పాపులారిటీ దక్కించుకుంది సితార. ఈ చిన్నారి ఎక్కువగా తండ్రి మహేష్ పాటలకు డాన్స్ లు చేస్తూ ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం రకరకాల ఫోటోలు, వీడియోలతో ఆకట్టుకుంటుంది సితార. సితారకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను నమ్రత కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా తెలుగు సంవతస్సరాది ఉగాదిని పురస్కరించుకుని సితార పట్టుబట్టల్లో బుట్టబొమ్మలా ముస్తాబైంది. ఇలా సితారని చూసి మహేష్ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.
సితార పట్టుబట్టలలో చాలా క్యూట్‌గా కనిపిస్తుండగా, ఈ వీడియెకి బ్యాక్ గ్రౌండ్ లో ‘సీతమ్మ వాకిట్లో సిరమల్లె చెట్టు’ సినిమాలోని మెలోడీ సాంగ్ ప్లే అవుతుంది. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సితార క్యూట్ లుక్స్‌పై నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక చిచ్చర పిడుగుకి అప్పుడే చాలా విషయాల మీద అవగాహన ఉంది. సెలెబ్రిటీ రేంజ్ లో పోస్ట్స్ పెడుతూ ఉంటుంది. ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న సితార సెకండ్ గ్రాడ్యుయేషన్ లో అడుగు పెట్టారట. ఈ విషయం ఇటీవల తెలియజేస్తూ నమ్రత తన ప్రౌడ్ మూమెంట్ ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది.
సితార త్వరలో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చే ఆస్కారం లేకపోలేదు. సర్కారు వారి పాట మూవీలో ‘పెన్నీ’ సాంగ్ ప్రమోషనల్ వీడియోలో సితార నటించిన విషయం తెలిసిందే. సితార నటనను కెరీర్ గా ఎంచుకుంటే ఆయన మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. ఈ విషయాన్ని మహేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక కొడుకు గౌతమ్ మహేష్ నటవారసుడిగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం కావడం అనివార్యం. చైల్డ్ ఆర్టిస్ట్ గా గౌతమ్ వన్ నేనొక్కడినే చిత్రంలో నటించారు. ప్రస్తుతం మహేష్ తన 28వ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…