Sitara Ad : సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార ఫుల్ స్పీడ్‌గా ఉంది. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో రీల్స్‌తో సందడి చేసిన సితార ఇప్పుడు యాడ్‌తో అందరిని అలరించింది. ప్రముఖ జ్యువెలరీ సంస్థ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన ఈ చిన్నారి దానికి సంబంధించిన ఓ కమర్షియల్ యాడ్ లోనూ నటించింది. తాజాగా ఆ యాడ్ కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశరు. ఇందులో ఇందులో సితార ప్రిన్సెస్ లా మెరిసిపోయింది. ఈ ప్రచార చిత్రాన్ని చాలా కొత్తగా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ఈ యాడ్ వీడియోను మహేశ్ .. తన సోషల్ మీడియాలో షేర్ చేసి మరోసారి మురిసిపోయారు.
వీడియోలో.. అమెరికా నుంచి తన ఓణీల ఫంక్షన్ కోసం తల్లితో కలిసి అమ్మమ్మ ఇంటికి వస్తుంది సితార. అయితే సితార మూడీగా ఉన్నట్లు గమనించిన అమ్మమ్మ.. నిన్ను ఒక చోటుకు తీసుకెళ్తాను. అక్కడ వాళ్ళు నిన్ను ప్రిన్సెస్ లా చూసుకుంటారు అని చెబుతుంది. చెప్పినట్టుగానే జ్యువెలర్స్ కు తీసుకెళ్లి సర్ ప్రైజ్ చేస్తుంది. అయితే నగలను చూసి.. ‘అమ్మమ్మ ఇదంతా అవసరమా?’ అని సితార అంటుంది. ఆ తర్వాత షాప్ సేల్స్ మెన్.. ఒకసారి అక్కడికి వెళ్లి చూడు ఏముందో అని చెబుతాడు. దీంతో సితార ఓ పెద్ద గదిలోకి వెళ్తుంది.
అక్కడి వెళ్లగానే తనను తాను నగలు ధరించిన ఓ క్వీన్ లాగా ఊహల్లో తేలిపోతుంది సితార. ఆ తర్వాత ఆ నగలు వేసుకుని తన ఓణీల ఫంక్షన్ ఎంతో సంతోషంగా జరుపుకుంటుంది. వీడియో ముగుస్తుంది. యాడ్ లో తనని ప్రిన్సెస్ లా చూసుకుంటారు అని చెప్పగా, దానికి సితార.. “నేను ప్రిన్సెస్ కాదు మహారాణి కావాలని అనుకుంటున్నాను” అంటూ వ్యాఖ్యానించింది.నిజమే సితార పాప ప్రిన్సెస్ కాదు ఫ్యూచర్ లో మహారాణిలా టాలీవుడ్ ని తన తండ్రిలా ఏలుతుంది అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు . కాగా ఈ యాడ్ కోసం సితార 1 కోటి వరకు తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ మొత్తం రెమ్యూనరేషన్ కూడా ఛారిటీకి ఇచ్చేసి తన తండ్రి మహేష్ లా గొప్ప మనుసు చాటుకుంది.