Pawan Kalyan : గత కొద్ది రోజులుగా వైసీపీ అక్రమాలని బయటపెడుతున్న పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ అవుతున్నారు. వారాహి యాత్ర సభలలో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని, వైసీపీ నాయకులపై తీవ్రమైన విమర్శలు చేశారు. తాజాగా తనపై పై కేసులు పెట్టి ప్రాసిక్యూషన్ చేసేందుకు జగన్ సర్కార్ అనుమతి ఇచ్చిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. సీఆర్‌పీసీలోని 199/4 కింద కేసులు పెట్టేందుకు సర్కారు అనుమతిచ్చింది. వాలంటీర్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందట. మీరు చేసే ప్రాసిక్యూషన్లకు నేను భయపడను. నేను అన్నీ ఆలోచించే మాట్లాడతాను.
నేను అరెస్ట్‌కి సిద్ధంగా ఉన్నాను. కాని ఈ ఒక్క సంఘటనే నీ ప్రభుత్వం పతనానికి రంగం సిద్దమైంది. దెబ్బలు తినడానికి, చిత్రహింసలకు కూడా సిద్దంగా ఉన్నా. అరెస్టులకు కూడా సిద్దంగా ఉన్నా … జగన్ నేను రెడీ” అని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏపీ అభివృద్ధికి నా కమిట్మెంట్. కోర్టులు కూడా జగన్ వేసే వేషాలు చూస్తూ ఉన్నాయి. మీ ఇష్టం వచ్చినట్లు నోటీసు ఇస్తే భయపడను. వాలంటీర్లు వ్యవస్థ విషయంలో నేను వాస్తవ పరిస్థితి చెప్పాను. కొంతమంది వైసీపీ నాయకులు చేసే అరాచకాలు వివరించాను. డిగ్రీ చదివిన వారికి రూ. 164 ఇస్తున్నారు. వాలంటీర్లు పేరుతో యువత జీవితం నాశనం చేస్తున్నారు.
జగన్ ప్రభుత్వం పెట్టిన వాలంటీర్లు వ్యవస్థ ద్వారా కలెక్టు చేసే డేటా ఎక్కడికి వెళ్తుంది. ప్రభుత్వం కుట్రలకు వాలంటీర్లు బలి అవ్వాలా.” అని పవన్ ప్రశ్నించారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉంటే అధికారులు జైలుకు వెళ్లారు. ఇప్పుడు జగన్ చెప్పినవిధంగా చేస్తే వాలంటీర్లు భవిష్యత్తు నాశనం అవుతుంది. నన్ను ప్రాసిక్యూషన్ చేయాలని కేసు వేశావ్. నీ మైనింగ్, ఇసుక, మద్యం అక్రమాలు బయటకి తీస్తాం. వైసీపీ నాయకులు అందరికి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. డేటా చౌర్యం చేసి ప్రైవేటు సంస్థలకు ఇచ్చారు. ప్రభుత్వాల వద్ద ఉండాల్సిన డేటాను ఎలా బయటకి ఇచ్చారు. ఏ జీఓ ప్రకారం అనుమతి ఇచ్చారు. ఏపీ రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి వచ్చాడు . ఒక వాలంటీర్ ఎనిమిదేళ్ల బిడ్డను రేప్ చేస్తే బాధ్యత ఎవరిది. ప్రజల డేటాను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం అంటే మీరంతా దోషులే అంటూ పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.