Horses Painting : ప్రస్తుత తరుణంలో ఆర్థిక సమస్యలతో చాలా మంది బాధ పడుతున్నారు. కొందరు డబ్బు సంపాదించలేక అవస్థలు పడుతుండగా.. ఇంకొందరు సంపాదించిన డబ్బు వృథాగా ఖర్చవుతుందని.. అసలు చేతిలో ఏమీ మిగలడం లేదని.. ఆందోళన చెందుతుంటారు. అయితే ఆర్థిక సమస్యలకు కొన్ని సార్లు వాస్తు దోషాలు కూడా కారణమవుతాయి. అలాగే ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ కారణంగా కూడా వాస్తు దోషాలు ఏర్పడి మనకు సమస్యలను కలగజేస్తాయి. కనుక ఈ దోషాలను తొలగించుకోవాలి. అప్పుడే మనకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది.
ఇక మన ఇంట్లో కొన్ని రకాల వస్తువుల వల్ల నెగెటివ్ ఎనర్జీ వచ్చినట్లే కొన్నింటి వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాంటి వాటిల్లో గుర్రపు బొమ్మలు, వాటి పెయింటింగ్‌లు ఒకటి. గుర్రాలు శక్తికి, వేగానికి ప్రతి రూపాలు. సూర్యుడు అనంత కోటి జీవరాశికి శక్తి, వెలుగు ప్రదాత. ఆయన రథాన్ని గుర్రాలు లాగుతుంటాయి. అలాంటి గుర్రాలకు చెందిన పెయింటింగ్‌లు లేదా బొమ్మలను ఇంట్లో పెట్టుకుంటే మనకు సూర్యుడి లాగే గుర్రాల నుంచి కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
![Horses Painting : అప్పుల బాధ నుంచి బయట పడాలంటే.. గుర్రాల పెయింటింగ్‌ను ఈ దిశలో వేలాడదీయండి..! put Horses Painting in this direction in your home to remove debts](http://3.0.182.119/wp-content/uploads/2022/10/Horses-Painting.jpg)
ఇంట్లో ఉత్తరం లేదా వాయువ్య దిశలో గుర్రాలు ఉన్న పెయింటింగ్‌ను వేలాడదీయాలి. ఆ పెయింటింగ్‌లో తెల్ల గుర్రాలే ఉండాలి. అవి పరుగు తీస్తున్నట్లు ఉండాలి. అలాగే వాటి సంఖ్య 5 గా ఉండాలి. ఇలాంటి పెయింటింగ్‌నే ఆ దిశలో వేలాడదీయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న వాస్తు దోషం పోతుంది. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దీంతో ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కవచ్చు. ముఖ్యంగా అప్పులు తొలగిపోతాయి. డబ్బు వృథాగా ఖర్చు కాదు. ధనం బాగా సంపాదిస్తారు.
ఇక దంపతులు తమ ఇంట్లో బెడ్‌రూమ్‌లో కిటికీ లేదా ఏదైనా షెల్ఫ్‌లో లేదా బెడ్‌కు దగ్గరగా ఉండే టేబుల్ మీద రెండు గుర్రపు బొమ్మలను ఉంచాలి. వాటిని ఎదురెదురుగా పెట్టాలి. దీంతో ఇంట్లో దంపతుల మధ్య ఉండే కలహాలు పోతాయి. వారి కాపురం అన్యోన్యంగా సాగుతుంది. ఎలాంటి మనస్ఫర్థలు రావు. గొడవలు ఏర్పడవు. ఇంట్లో సంతోషంగా ఉంటారు. ఇలా గుర్రపు బొమ్మలు లేదా వాటి పెయింటింగ్‌లతో మన ఇంట్లో ఉండే సమస్యలను తొలగించుకోవచ్చు.