Sid Sriram : తెలుగు వాడు కాకపోయినా ఎక్కువ సూపర్ హిట్స్ తెలుగులోనే అందుకున్న సింగర్ సిద్ శ్రీరామ్. ఈయన పాటకు పరవశించని వారు ఉండరు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈయన హవానే నడుస్తోంది. ఏ పాట విన్నా సిద్ శ్రీరామ వాయిస్సే. ఇటీవల మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాటలో కళావతి సాంగ్ కూడా పాడింది సిద్ శ్రీరామ్. అతని పాటలో ఏదో తెలియని తీయదనం ఉంటుంది. సిద్ పాట వింటే వెంటనే అలా కనెక్ట్ అయిపోతుంటాం. పాట ఏదైనా అది సిద్ పాడితే హిట్ అవ్వాల్సిందే. సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆయన పాడిన పాటలు సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి.
తమిళనాడులో పుట్టి అమెరికాలో పెరిగిన శ్రీరామ్ డియర్ కామ్రెడ్ సినిమాతో తెలుగు సినీ పాటల ప్రస్థానం మొదలు పెట్టాడు. దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీలలో ఉన్న టాప్ మోస్ట్ పాపులర్ సింగర్లలో ఒకరిగా సిద్ శ్రీరామ్ ఉన్నాడు. ఆయన ఒక్కపాటకు రూ.5లక్షల నుండి రూ.7లక్షల వరకు తీసుకుంటాడని టాక్ వినిపిస్తోంది. టాప్ సింగర్స్ కూడా ఆ రేంజ్ రెమ్యునరేషన్స్ అందుకోరు. కానీ తన పాటలకు వస్తున్న రెస్పాన్స్ బట్టి సిద్‌కి ఆ రెమ్యునరేషన్ ఇవ్వక తప్పడం లేదు.
మాటే వినదుగాపాట నుండి మొన్న వచ్చిన శ్రీ వల్లి పాట దాకా సిద్ శ్రీరామ్ పాడిన చాలా పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. టాక్సీవాలాలో మాటే వినదుగా.., అల వైకుంఠపురములో చిత్రంలో సామజవరగమన.., 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? లో నీలి నీలి ఆకాశం.., వకీల్ సాబ్ లో మగువా మగువా.., రంగ్ దేలో నా కనులు ఎపుడు.., పుష్పలో పాడిన శ్రీవల్లి.. ఇలా చెప్పుకుంటూ పోతే సిద్ ఖాతాలో ఎన్నో హిట్ సాంగ్స్ ఉన్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…