Shubman Gill : టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇటీవల అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతూ తెగ వార్తలలో నిలుస్తున్నాడు. అయితే శుభ్‌మన్ గిల్‌కి సంబంధించిన ప్రేమ వార్తలు కూడా ఎప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తూనే ఉంటాయి. టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముద్దుల తనయ సారా టెండూల్కర్‌తో శుభ్‌మన్ ప్రేమాయణం నడుపుతున్నాడని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో వీరిద్దరు ఒకరినొకరు ఫాలో కావడం, ఫొటోలకు పరస్పరం కామెంట్లు చేసుకోవడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. అయితే ఇటీవలే సచిన్ తనయకు బ్రేకప్ చెప్పిన శుభ్‌మన్ బాలీవుడ్ హీరోయిన్, పటౌడీ వారుసురాలు సారా అలీఖాన్‌తో పీకల్లోతు ప్రేమలో పడ్డాడనే వార్తలు గుప్పుమన్నాయి.
అయితే తాజాగా ఈ యువ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో నేషనల్ క్రష్ అయిన రష్మిక మందన్నాపై తనకి క్రష్ ఉందని చెప్పుకొచ్చాడు. శుభ్‌మన్ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల మీడియా ఇంటరాక్షన్‌లో, శుబ్మాన్ గిల్‌ను అతను ఎక్కువగా ఇష్టపడే నటి గురించి అడగగా, మొదట్లో, నవ్వుతోనే సమాధానం ఇచ్చాడు . కాని మరింత ఫోర్స్ చేయడంతో అతను రష్మిక మందన్న అని చెప్పాడు. ఆమెపై తనకు క్రష్ ఉందని చెప్పాడు. రష్మిక పై శుభ్‌మాన్ గిల్‌కి అంత క్రష్ ఉందనే విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది . రష్మిక అభిమానులు ఇప్పుడు దీనిని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. దీనిపై రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
గత మూడేళ్ల నుంచి భారత జట్టులో ఆడుతున్న శుభమన్ గిల్ కెరీర్ ఇటీవల గాడిన పడింది అని చెప్పాలి.. వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనలో పరుగుల వరద పారించిన శుభమన్ గిల్ వన్డే టీమ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే ఆట పరంగా కాకుండా మరోసారి ఆటేతర అంశాలతో అతను వార్తల్లో నిలుస్తున్నాడు.. సోషల్ మీడియాలో అభిమానులు అతని ప్రేమ వ్యవహారాలపై ఫన్నీగా సెటైర్లు పేలుస్తున్నారు. మొత్తానికి రష్మకిపై తన ప్రేమను వ్యక్తం చేయడంతో ఇప్పుడు ఎలా టర్న్ తీసుకుంటుందో చూడాలి.