Shriya Sharma : పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా నటించిన వారు ఇప్పుడు పెరిగి పెద్దగై తమ అందచందాలతో తెగ అలరిస్తున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, సమీరా రెడ్డి, భూమిక కలిసి నటించిన చిత్రం జై చిరంజీవ. ఈ సినిమాలో చిరంజీవి ముద్దుల కోడలుగా నటించిన అమ్మాయ్ శ్రియ శర్మ. మేనకోడలు పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ హిందీ, కన్నడ, తమిళ అన్ని భాషల్లోనూ వరుస అవకాశాలు దక్కించుకొని తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.నిజానికి మెగా స్టార్ జై చిరంజీవ సినిమా కంటే ముందుగానే ఈ అమ్మాయ్ సూర్య, జ్యోతిక కూతురుగా నువ్వు నేను ప్రేమ సినిమాలో నటించింది. ఇందులో తన నటనతో ఎంతగా మెప్పించింది.
మహేష్ బాబు దూకుడు సినిమాలో సమంత చెల్లిగా కూడా నటించింది శ్రియా శర్మ. ఈ అమ్మడు టాలీవుడ్ లో వరుస అవకాశాలతో కొంతకాలం దుమ్ములేపింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రామ్ చరణ్ రచ్చ, తూనీగ తూనీగ, నాని ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమాల్లోనూ టీనేజ్ అమ్మయ్యిగా అద్భుతంగా నటించి అలరించింది. బిగ్‌బాస్ ఫేమ్ అలీరాజా హీరోగా నటించిన గాయకుడు చిత్రంతో శ్రియ శర్మ హీరోయిన్ గా పరిచయం అయ్యింది.
ఈ సినిమా హిట్ అవ్వకపోయినప్పటికీ.. వెంటనే టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కొడుకు నిర్మలా కాన్వెంట్ సినిమాలో అవకాశం వచ్చింది. ఇందులో శ్రియ శర్మ ఎంతో ముద్దుగా నటించి ప్రేక్షకులను మెప్పించారు.ఇక సోషల్ మీడియాలోను ఈ అమ్మడు రచ్చ మాములుగా ఉండదు. ఎప్పటికప్పుడు సరికొత్త అందాలని పంచుతూ కూడా థ్రిల్ చేస్తుంటుంది. అందం,అభినయం ఉన్నా కూడా ఎందుకో శ్రియా శర్మ పెద్దగా అవకాశాలు అందిపుచ్చుకోవడం లేదు.