టీ 20 వరల్డ్ కప్‌లో భారత ప్రదర్శనపై అందరిలో అనేక అనుమానాలు ఉన్నాయి. ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ల ప్రదర్శన అంతగా ఏమి లేదు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అద్భుత ప్రదర్శనతో విజయం సాధించారు. ఇక నెదర్లాండ్స్ మ్యాచ్‌లో అంతగా చెప్పుకోదగ్గ ప్రదర్శన అయితే కనబరచలేదు. దీంతో ఇండియా సెమీస్ దాటి ఫైనల్‌కి వెళుతుందా అనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. సెమీస్‌కి ఇండియా వెళ్లడం పెద్ద కష్టం ఏమి కాదు. సెమీ ఫైనల్ చేరినా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా అంతకుమించి ముందుకు వెళ్లదని కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్.
పాకిస్తాన్ టీమ్ బాలేదు, వాళ్ల ఆట తీరు కూడా ఏమంత బాలేదు. ఐసీసీ టోర్నీలకు యావరేజ్ టీమ్‌ని సెలక్ట్ చేసి, యావరేజ్ ఆట ఆడిస్తే… ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి. సూపర్ 12 రౌండ్ నుంచి పాక్ ఇంటిదారి పడుతుందని ముందుగానే ఊహించా. ఇక టీమిండియా మరో వారం ఆడుతుందంతే. వాళ్లు కూడా సెమీ ఫైనల్‌లో ఒడిపోయి వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్లేం తీస్ మార్ ఖాన్‌లు కాదు. పాకిస్తాన్ టీమ్ ఎలాగైతే యావరేజ్‌గా ఉందో టీమిండియా కూడా అంతే. అయితే మన టీమ్, వాళ్ల కంటే చెత్తగా ఉంది అంతే.. ఐసీసీ టోర్నీలు గెలవాలంటే కావాల్సిన రేంజ్ ఇరు జట్ల దగ్గరా లేదు అని షోయబ్ అన్నాడు.
పాక్‌కి ఓ చెత్త కెప్టెన్ దొరికాడు. ఈ ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లతో మీరు మ్యాచులేం గెలుస్తారు. షాహీన్ ఆఫ్రిదీ ఫిట్‌గా ఉన్నాడా? అతను ఫిట్‌గా లేకపోయినా ఆడించాలని ఆడిస్తున్నారా? మన ఓపెనర్లకు 30 యార్డ్ సర్కిల్‌ని ఎలా వాడుకోవాలో కూడా తెలీదు. ఫకార్ జమాన్ లాంటి బ్యాక్ ఫుట్ బ్యాటర్, ఆస్ట్రేలియాలో బాగా ఆడగలడు. ఓ ప్లాన్ లేదు, ఓ మిడిల్ ఆర్డర్ లేదు… సరైన ఓపెనర్లు లేరు…’ అంటూ నిప్పులు చెరిగాడు పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్. ఇండియా, జింబాబ్వే చేతిలో ఓటమి తరువాత పాక్ సెమీస్ భవితవ్యం ఇతర జట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. పాకిస్థాన్ ఇకపై ఆడే అన్ని మ్యాచ్‌లు మంచి నెట్ రన్‌రేట్‌తో గెలవాలి. ఇండియా అన్ని మ్యాచ్‌లు గెలవడంతో పాటు.. సౌతాఫ్రికా, జింబాబ్వే రెండు మ్యాచ్‌లు ఓడిపోవాలి. ఇలా జరిగితే పాక్ సెమీస్ చేరే అవకాశం ఉంటుంది. ఇది దాదాపు అసాధ్యమే అని చెప్పాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…