Shai Hope : అచ్చం విరాట్ కోహ్లి మాదిరిగానే ఆడుతున్నాడే.. వాహ్‌.. ఏం ఆడాడు..!

Shai Hope : వెస్టిండీస్ జ‌ట్టు సౌతాఫ్రికాని మ‌ట్టి కరిపించింది. స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ క్రికెట్ టీమ్ సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ట్రినిడాడ్ టరూబాలోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా తాజాగా జరిగిన మూడో టీ20లో సౌతాఫ్రికాను 8 వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 13 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాటింగ్ చేస్తుండగా వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్ చెలరేగి ఆడి.. 15 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. రికెల్టన్ 27, మార్క్రం 20 పరుగులు చేశారు. మొదట బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (40) ధాటిగా ఆడాడు. విండీస్‌ లక్ష్యాన్ని 13 ఓవర్లలో 116 పరుగులుగా నిర్దేశించగా షై హోప్‌ (42 నాటౌట్‌), నికోలస్‌ పూరన్‌ (35) వేగంగా ఆడి 9.2 ఓవర్లలోనే గెలుపు లాంఛనాన్ని పూర్తిచేశారు.

అయితే విరాట్ కోహ్లీ మాదిరిగా షై హోప్‌ ఆడిన ఒక షాట్ మాత్రం అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది. అచ్చం విరాట్ స్టైల్‌లో క‌వ‌ర్ డ్రైవ్ ఆడి అద‌ర‌హో అనిపించారు. ప్ర‌తి ఒక్క‌రు కూడా విరాట్ కోహ్లీ, షై హోప్‌ ల షాట్స్‌ని కంపేర్ చేస్తూ ఆ పిక్స్ నెట్టింట వైర‌ల్ చేస్తున్నారు. ప్రస్తుతం పిక్స్‌తో పాటు వీడియోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. బార్ట్‌మాన్ ఆఫ్ సైడ్ వేసిన బాల్‌కి కోహ్లీ మాదిరిగా షై హోప్ డ్రైవ్ షాట్ ఆడి బంతిని బౌండ‌రీకి త‌ర‌లించాడు. ఇది చూడ‌ముచ్చ‌ట‌గా అనిపించింది. ఇక విండీస్ టీమ్ 9.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. షాయ్ హోప్, నికోలస్ పూరన్, షిమ్రోన్ హెట్‌మైర్‌ పవర్ హిట్టింగ్‌తో విండీస్ ఈజీగా విజయం సాధించింది. షాయ్ హోప్ 24 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. నికోలన్ పూరన్ సిక్సర్ల ధమాకా ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. 13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 35 రన్స్ సాధించాడు. హెట్‌మైర్‌ 17 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 31 పరుగుల చేసి నాటౌట్‌గా మిగిలాడు. సౌతాఫ్రికా బౌలర్లలో జార్న్ ఫోర్టుయిన్, ఒట్నీల్ బార్ట్‌మాన్ చెరో వికెట్ తీశారు.

Shai Hope played cricket shot just like virat kohli video viral
Shai Hope

2 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టిన విండీస్ బౌలర్ రొమారియో షెపర్డ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. మూడు మ్యాచ్‌ల్లో కలిపి 134 పరుగులు చేసిన షాయ్ హోప్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. కాగా, నికోలస్ పూరన్ 205.17 స్టైక్‌రేట్‌తో ఈ సిరీస్‌లో 12 సిక్సర్లతో 119 పరుగులు సాధించాడు. సౌతాఫ్రికా బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ 144 పరుగులతో హయ్యస్ట్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్ కేశవ్ మహరాజ్ 13 వికెట్లు పడగొట్టి బౌలర్ల లిస్టులో టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago