Shaakuntalam Review : శాకుంతలం మూవీ రివ్యూ.. స‌మంత‌ ఖాతాలో హిట్ ప‌డ్డ‌ట్టేనా..?

Shaakuntalam Review : సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం శాకుంతలం. యశోద లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమా తర్వాత సమంత నటించిన సినిమా కావడం, డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌డంతో పాటు బ‌న్నీ కూతురు అర్హ చిత్రంలో న‌టించ‌డంతో మూవీపై అంచ‌నాలు భారీగా ఏర్ప‌డ్డాయి. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుద‌లైంది. మ‌రి ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ని మెప్పించిందా లేదా అనేది చూద్దాం.

చిత్ర క‌థ విష‌యానికి వ‌స్తే.. శకుంతల జననంతోనే చిత్ర క‌థ‌ మొదలవుతుంది. విశ్వామిత్రుని తపస్సు భంగం కలిగించేందుకు మేనకను ప్రయోగించిన ఇంద్రుడు వారిద్దరూ ప్రేమలో పడేలా చేయ‌గా, వారి ప్రేమకు గుర్తుగా శకుంతల జన్మిస్తుంది. అయితే మేనక అప్సరస కావడం వ‌ల‌న తనకు పుట్టిన సంతానాన్ని పక్షులకు అప్పగించి వెళుతుంది. ఆ పక్షుల సంరక్షణకు పెరుగుతున్న శకుంతలను కణ్వ మహర్షి(సచిన్ కెడ్కర్) చూసి ఆమెను దత్త పుత్రికగా స్వీకరిస్తాడు. కణ్వ ఆశ్రమంలోనే పెరిగిన శకుంతల(సమంత)ను మొదటి చూపులోనే చూసి ప్రేమలో పడతాడు దుష్యంతుడు(దేవ్ మోహన్). ఆ త‌ర్వాత ఆమెను గాంధ‌ర్వ వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత శకుంతల జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు ఏంటి, త‌న‌కు ఎదురైన స‌మ‌స్య‌ల‌ని ఎలా సాల్వ్ చేసుకంది అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

Shaakuntalam Review in telugu how is it
Shaakuntalam Review

సమంత శకుంతల పాత్రలో పూర్తిస్థాయిలో జీవించింది అని చెప్పాలి. అయితే సొంత డబ్బింగ్ కావడంతో కొంచెం ఎబెట్టుగా అనిపిస్తుంది. దుష్యంతుడుగా దేవ్ మోహన్ తనదైన శైలిలో నటించాడు. అల్లు అర్హ కనిపంచింది చివరి పావు గంటే అయినా ఆమెను చూడగానే సినిమా మొత్తానికి ఎనర్జీ వచ్చేస్తుంది. ఇక మిగిలిన పాత్రలు పోషించిన సచిన్ కేడ్కర్, ప్రకాష్ రాజ్, గౌతమి, అనన్య, నాగళ్ళ శివ బాలాజీ వంటి వారు తమదైన శైలిలో నటించి ప్రేక్ష‌కుల‌ని అల‌రించారు. దర్శకుడిగా గుణశేఖర్ తనదైన మార్కు వేసుకునే ప్రయత్నం చేశాడు.

చాలా వరకు అందులో సఫలీకృతం అయ్యాడు. గుణశేఖర్ మార్క్ ఎక్కడా తప్పినట్లు అనిపించలేదు. ఇక సాయి మాధవ్ బుర్ర అందించిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. మణిశర్మ పాటలు మైమరిపించే స్టైల్లో సాగాయి. విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకి అదనపు ఆకర్షణ . సినిమాటోగ్రాఫర్ శేఖర్ జోసెఫ్ పనితనం సినిమా ఆద్యంతం కనిపించింది. ఎడిటింగ్ టేబుల్ మీద కూడా పూర్తిస్థాయిలో టీమంతా దృష్టి పెట్టినట్లు అనిపించింది. అయితే ఈ సినిమా అంద‌రు మెచ్చే చిత్రం అయితే కాదు.

Share
Shreyan Ch

Recent Posts

OTT Horror Web Series : హార‌ర్ వెబ్‌సిరీస్‌ని తెలుగులోకి తీసుకొస్తున్న బాహుబ‌లి నిర్మాత‌లు.. స్ట్రీమింగ్ ఎందులో కానుంది అంటే..!

OTT Horror Web Series : ఇటీవ‌లి కాలంలో వెబ్ సిరీస్‌ల‌కి మంచి డిమాండ్ ఉంది. పెద్ద పెద్ద నిర్మాత‌లు…

14 hours ago

OTT Suggestion : ఈ సినిమా చూడాలంటే చాలా గుండె ధైర్యం ఉండాలి.. లేకపోతే అంతే..!

OTT Suggestion : ఇటీవ‌లి కాలంలో హ‌ర‌ర్ సినిమాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాయి. ప్ర‌తి సినిమా కూడా వైవిధ్య‌మైన కంటెంట్‌తో…

18 hours ago

Pawan Kalyan : అన్నాలెజినోవాతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి విడాకులు.. పుకార్ల‌కి అలా పుల్‌స్టాప్ పెట్టిన ప‌వ‌న్..

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి…

1 day ago

Vote Ink : ఓటు వేసాక వేలికి పెట్టే సిరా పోవాలి అంటే ఏం చేయాలి..?

Vote Ink : ఈ రోజు భారతదేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా…

2 days ago

Team India : క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్న ఆ ఇద్ద‌రు ఆట‌గాళ్ల ఫాం.. ఇలా ఆడితే వ‌ర‌ల్డ్ క‌ప్ కూడా గోవిందే..!

Team India : మ‌రి కొద్ది రోజుల‌లో వెస్టిండీస్, అమెరికా వేదిక‌గా టీమిండియా వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌నున్న విష‌యం తెలిసిందే.…

2 days ago

Bumrah Sunil Narine Wicket : సునీల్ న‌రైన్ వికెట్ తీసిన బుమ్రా.. సోష‌ల్ మీడియాలో న‌రైన్ పై ట్రోల్స్‌..

Bumrah Sunil Narine Wicket : ప్ర‌స్తుతం ఐపీఎల్ చాలా ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. బ్యాట‌ర్స్‌.. బౌల‌ర్స్‌ని టార్గెట్ చేసుకొని ఎడాపెడా…

2 days ago

Chandra Babu : చంద్ర‌బాబు ఆ ఒక్క‌దానిపైనే న‌మ్మకం పెట్టుకున్నారా.. అది నిల‌బెడుతుందా..?

Chandra Babu : ఏపీలో ఈ సారి రాజ‌కీయం మ‌రింత రంజుగా మారింది. వైసీపీ సింగిల్‌గా పోటీ చేస్తుండ‌గా, టీడీపీ,…

3 days ago

YSRCP Vs TDP : ఎల్లో టీమ్‌లో టెన్ష‌న్ టెన్ష‌న్.. విజ‌యంపై ధీమా వ్య‌క్తం చేసిన వైసీపీ..

YSRCP Vs TDP : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నిక‌లు ర‌స‌వ‌త్తరంగా మారుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. టీడీపీ, బీజేపీ, జనసేన…

3 days ago