Vani Vishwanath : మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ చిత్రాలలో ఘరానా మొగుడు ఒకటి. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నగ్మా మెయిన్ హీరోయన్‌గా నటించగా, సెకెండ్ హీరోయిన్‌గా వాణీ విశ్వనాథ్ కనిపించింది. ఈ సినిమాలో నగ్మా పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో, వాణీ విశ్వనాథ్ క్యారెక్టర్ అంతే కీలకం అని చెప్పాలి.. ముఖ్యంగా చిరంజీవి-వాణీ విశ్వనాథ్ కాంబినేషన్‌లో వచ్చిన సీన్లు, పాటలు సినిమా విజయంలో ఎంతో ముఖ్య పాత్ర పోషించాయి. ఘరానా మొగుడు సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకుంది వాణీ విశ్వనాథ్.
ఈ సినిమా తర్వాత నా మొగుడు నాకే సొంతం, మా ఇంటి కథ, కొదమ సింహం, వదిన గారి గాజులు, ప్రేమ చిత్రం పెళ్ళి విచిత్రం, మామా – కోడలు, లేడీస్ స్పెషల్, జోకర్ తదితర సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా చేరువైంది వాణీ విశ్వనాథ్. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ నటించి మెప్పించిన ఈ అమ్మడు సినీ కెరీర్ పీక్స్ లో ఉండగానే ప్రముఖ మలయాళ నటుడు బాబూరావును ప్రేమించి పెళ్లిచేసుకుంది. ప్రస్తుతం భర్తతో వైవాహిక జీవితం చాలా సంతోషంగా గడుపుతుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి తర్వాత ఈమె జయ జానకి నాయక వంటి సినిమాలు చేసింది.
అనంతరం రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టిన వాణీ విశ్వనాథ్ నగరి నియోజకవర్గము నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తోందని వార్తలు వచ్చాయి. అయితే రీసెంట్‌గా ఈమె ఒక వివాహ వేడుకలో కనబడి అందరిని ఆశ్చర్యపరచింది. ఒకప్పుడు చాలా నాజూగ్గా ఉండే వాణీ విశ్వనాథ్ ఇప్పుడు కాస్త బొద్దుగా మారింది. కానీ అదే అందం. అందంలో మాత్రం తగ్గేదేలేదు అంటోంది. ప్రస్తుతం వాణి విశ్వనాథ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. అందంలో అప్పటికీ, ఇప్పటికీ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. వాణీ విశ్వనాథ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో అయిన తిరిగి నటిస్తే బాగుంటుందని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…