కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్‌లో విడుదలై మంచి హిట్ సాధించిన చిత్రం చందమామ. ఇందులో కాజల్‌తో పాటు సింధ మేనన్ కథానాయికగా నటించింది.చాలా హోమ్లీగా అనుకువగా పక్కింటి అమ్మాయి మాదిరిగా ఉండే ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయింది. సినిమాలో ఈ అమ్మడి పర్‌ఫార్మెన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. చందమామ సినిమా తర్వాత సింధు వైశాలి సినిమాలో విలక్షణతను చూపించి ఆకట్టుకుంది. అయితే ఇటీవల కాలంలో ఈ అమ్మడు ఎక్కడ కనిపించడం లేదు. ప్రస్తుతం భారత దేశంలో కూడా ఉండడమే లేదు. దీంతో ఆమె ఎక్కడ ఉన్నారు ఎం చేస్తున్నారు , లైఫ్ ఎలా ఉందో తెలుసుకోవాలని అభిమానులు తెగ ఆరాటపడుతున్నారు.
సింధు మేనన్ 1994లోనే బాల నటిగా కన్నడ సినిమాలో నటించింది. బెంగళూరులోని ఒక మలయాళీ కుటుంబంలో జన్మించిన సింధు మీనన్ అక్కడే పెరిగింది. చదువు పూర్తయిన తరువాత ఆమె సినిమాల వైపు వడివడిగా అడుగులు వేసింది. సినిమాలకు దూరం అయిన తర్వాత సింధుమీనన్ కొంతకాలం మలయాళంలో టీవీ సీరియల్స్ మరియు రియాల్టీ షోలలో కనిపించింది. ఆ తర్వాత 2010 లో ఆమె వివాహం చేసుకుని సెటిల్ అయ్యింది. ప్రస్తుతం వీరికి ఒక పాప బాబు ఉన్నారు. సింధు మీనన్ ఫ్యామిలీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇంతకు ఈ అమ్మడు పెళ్లి ఎవర్ని చేసుకుందో తెలుసా? లండన్ లో సెటిల్ అయిన తెలుగు టెక్కీ డొమినిక్ ప్రభుని ప్రేమించి వివాహమాడింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. పాప స్వెత్లానా, ఒక బాబు. ఇప్పుడు ఆమె కుటుంబంతో కలిసి లండన్ లోనే నివసిస్తుంది.పెళ్లయిన తరువాత కూడా కొద్దీ కాలం పాటు చిత్రాల్లో నటించిన సింధు ఆతరువాత వాటికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. 2012 నుంచి ఆమె ఎటువంటి చిత్రాలను కానీ, టీవీ షోస్ కానీ చేయలేదు. 13 వ ఏటనే ఫుల్ టైం హీరోయిన్ గా కన్నడ చిత్రంలోకి అడుగు పెట్టింది సింధు మేనన్.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…