సావిత్రి.. ఈ పేరు తెలుగు వెండి తెరలో ఓ శతాబ్ధపు చరిత్ర. తారల జీవితాల్లోని విషాదానికి నిలువెత్తు నిదర్శనం. తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. అది సావిత్రి పేరు లేకుండా అయితే ఉండదు. పురుషాధిక్యం మెండుగా ఉన్న మొదటి రోజుల్లో.. హీరోలకు ధీటుగా ఆమె స్టార్‌డమ్‌ను సంపాదించింది. హీరోలు కూడా తమ సినిమాలో సావిత్రి ఉండాలని పట్టుబట్టడమే కాదు ఆమె కాల్షీట్స్ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూసేవారు. కడు పేదరికం నుంచి వచ్చిన ఆమె వెండి తెరపై నటిగా అద్భుతాలను సృష్టించింది. కోటాను కోట్ల రూపాయల ఆస్తులని కూడబెట్టింది. హైదరాబాద్, చెన్నై, విజయవాడల్లో ఆమెకు ఉన్న ఆస్తుల్ని ఇప్పటి లెక్కప్రకారం లెక్కగడితే వేల కోట్లు ఉంటుంది
సావిత్రి చివరి దశలో తీవ్ర దుర్భర జీవితాన్ని అనుభవించారనే విషయం మాత్రమే ప్రపంచానికి తెలుసు. కానీ, దీనిపై ఉన్న వాదనలు.. ప్రతివాదనలు మాత్రం కొద్ది మందికే తెలుసు. 46 ఏళ్ల వయసుకే తుది శ్వాస విడిచిన సావిత్రి.. ప్రేమలో విఫలమయ్యారు. ప్రేమించిన జెమినీ గణేశన్‌ను వివాహం చేసుకున్నా.. తర్వాత.. ఎలాంటి సుఖం లేకపోవడం.. ఆయన మొదటి భార్యతో ఇబ్బందులు సావిత్రిని కుంగదీశాయి. ఈ క్రమంలోనే మద్యానికి అలవాటు పడి చివరకు బానిసగా మారడం, ఆరోగ్యం క్షీణించడం జరిగింది.చివరి రోజులలో జరిగిన పరిణామాలతో సావిత్రి బిడ్డలే.. ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టారని ఒక టాక్ ఉంది. చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ ఉన్న సావిత్రి అనారోగ్యం పాలై అనాథగా చనిపోయారని మరో టాక్.
అయితే ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌తో ఎన్నో సూపర్ హిట్స్ చేసిన సావిత్రి తమిళనాడు స్టార్ నటులైన ఎంజీఆర్,శివాజీ గణేషన్ లాంటి వారి గొప్ప వారితో సినిమాలు తీసింది. తెలుగు ఇండస్ట్రీ సావిత్రి కి పుట్టినిల్లు అయితే తమిళ ఇండస్ట్రీ మెట్టినిల్లు అనేవారు. సావిత్రి చనిపోయిన తర్వాత ఆమెకు సంబంధించిన కోట్లాది ఆస్తులు తన కూతురు చాముండేశ్వరి, కొడుకు సతీష్ కుమార్ లకు దక్కింది. సావిత్రి చనిపోవడానికి ప్రధాన కారణం మొండివైఖరి అంటారు. జెమినీ గణేషన్ కు దూరంగా ఉంటూ డిప్రెషన్ లోకి వెళ్లిన సావిత్రిని వ్యసనాలు మానుకోవాలని ఎన్టీఆర్, ఏఎన్ఆర్,సావిత్రికి చాలాసార్లు చెప్పారట. కానీ ఆమె మాత్రం వారి మాటను బేఖతరు చేస్తూ తన వ్యసనాలను రోజురోజుకు పెంచుకుంటూ వెళ్ళింది. ఈ క్రమంలో ఆమెకు సహాయం చేయడానికి కూడా వెళ్లేవారు కాదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఆమె చనిపోయిన తర్వాత కూడా ఎవరూ కనీసం చూడ్డానికి కూడా వెళ్లలేదని అంటుంటారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…