Samantha : ఇప్పుడు చాలా మంది సినీ ప్రముఖులు సినిమాలలో సత్తా చాటుతూనే రాజకీయాలలో కూడా రాణించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో సమంత కూడా రాజకీయాలలోకి రాబోతుందంటూ కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఉన్న సమంత రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తే కచ్చితంగా సక్సెస్ అవుతుందని ఆమె అభిమానులు చెప్పుకొస్తున్నారు. అయితే అసలే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సమంత రాజకీయాలలోకి రావడం ఏంటని చాలా మందిలో అనుమానాలు అయితే ఉన్నాయి. అసలు విషయం ఏంటంటే.. వచ్చే ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి తరఫున, సమంత ఎన్నికల ప్రచారంలో కనిపించబోతోందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
గతంలో సమంత, తెలంగాణలో నేతన్నలకి మద్దతుగా పలు కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవాన్ని కూడా అందుకుంది. తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ సమంత.. అని అప్పట్లో పెద్దయెత్తున ప్రచారం చేసింది. ఆ తర్వాత ఏమయ్యిందో.. సమంత, మళ్ళీ ఆ తరహాలో రాజకీయ వార్తల్లో కనిపించలేదు. మళ్ళీ ఇప్పుడు, తాజాగా ‘స్టార్ క్యాంపెయినర్’ అనే కోణంలో సమంత పేరు ప్రచారంలోకి వచ్చింది. ఈ విషయమై ఆరా తీస్తే, సమంత ఎలాంటి పొలిటికల్ కమిట్మెంట్స్ జోలికీ వెళ్ళడం లేదని తెలిసింది.
సమంతని ఎన్నికల ప్రచారంలోకి తీసుకురావాలనే ప్రయత్నాలైతే గట్టిగానే బీఆర్ ఎస్ నాయకులు చేస్తున్నారట. మరి దీనిపై సమంత అంత ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది. ఇక సమంత కొద్ది రోజుల క్రితం మయోసైటిస్ చికిత్స కోసం అని అమెరికా వెళ్లింది. అక్కడ ఖుషి ప్రమోషన్ ఈవెంట్ లో కూడా పాల్గొంది అని చెప్పాలి. అలాంటి సమంత సడన్గా హైదరాబాద్ వచ్చేసింది అనేది తెలుస్తుంది. ఇక అమెరికాకు వెళ్లి అక్కడే చాలా రోజులు ఉండాలనుకున్న సమంత సడన్ గా ఎందుకు హైదరాబాద్ వచ్చేస్తుంది అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే ఖుషి మేకర్స్ ప్రస్తుతం సక్సెస్ మీట్ నిర్వహించాలని అనుకుంటున్నారట. ఈ సక్సెస్ మీట్ కి సమంత వస్తే ఆమె చుట్టూ వస్తున్న కొన్ని సందేహాలు తొలగినట్టు అవుతుందని అనుకుంటున్నారట మేకర్స్. ఈ క్రమంలోనే సమంతను మేకర్స్ హైదరాబాద్ పిలిచినట్లు తెలుస్తోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…