Samantha : అక్కినేని మాజీ కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం కెరీర్‌లో దూసుకుపోతుంది. ఫ్లాపులు వచ్చిన కూడా ఏమాత్రం అధైర్యపడకుండా సినిమాలు చేస్తుంది. తన జీవితంలో ఎదురైన సవాళ్లను దాటుకుంటూ సమంత రియల్ లైఫ్ లో చాలా సినిమాలనే చేసిందని చెప్పొచ్చు. అందుకే ఆమె సెలబ్రిటీస్ కి చాలా మందికి స్పూర్తిగా నిలిచింది. శాకుంతలం సినిమా రిజల్ట్ సమంతని చాలా నిరాశపరచిన కూడా ఏమాత్రం అధైర్యపడకుండా సినిమాలు చేస్తుంది. సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమా చేస్తుంది. అంతేకాదు తాను యువ హీరోల సరసన నటించేందుకు కూడా సై అనేస్తుందట అమ్మడు. ఈ క్రమంలోనే సిద్ధు జొన్నలగడ్డ తో సినిమా కు సైన్ చేసినట్టు టాక్.
లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. సమంత యువ హీరోలతో జత కట్టడం మొదలైతే మాత్రం ఆమె కెరీర్ మళ్లీ సూపర్ స్వింగ్ లో ఉంటుందని చెప్పొచ్చు. నందిని రెడ్డి డైరెక్షన్ లో సినిమా అంటే సమంతకు మంచి పాత్ర దక్కినట్టే.. ఇక సమంత సిటాడెల్ యాక్షన్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సిటాడెల్ ఇంటర్నేషనల్ సిరీస్. ఇంగ్లీష్ లో ప్రియాంక చోప్రా చేశారు. దాని ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తున్నారు. బోల్డ్ సన్నివేశాలు కూడా ఎక్కువగానే ఉంటాయని తెలుస్తుంది. శృంగార సన్నివేశాల్లో నటించేందుకు చాలా ఇబ్బందిపడ్డానని ప్రియాంక చోప్రా నేరుగా చెప్పారు.
మరి వరుణ్ ధావన్-సమంత మధ్య ఆ తరహా సన్నివేశాలు ఉండనున్నాయని అందరు ముచ్చటించుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే సమంత తాజాగా తన పోస్ట్‌లో పార్ట్నర్ ని వెతుకుతున్నట్టు పోస్ట్ పెట్టింది. అయితే ఆ పార్ట్నర్‌ని వెతుకుతుంది తన కోసం కాదు. తన సన్నిహితుడు కోసం. డాక్టర్ జెవెల్ గమాడియాకు మంచి జోడీ కావాలట. అతని ఫోటో షేర్ చేసిన సమంత అతనికి మంచి జోడీ కావాలన్నారు. అలాగే డాక్టర్ గమాడియా లక్షణాలు కూడా సుచాయిగా చెప్పింది.. పైకి కనిపించే దానికంటే తెలివైనవాడు అంటూ మరో కామెంట్ చేసింది. సమంత పోస్ట్ వైరల్ అవుతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…