Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఆరోగ్య పరిస్థితి బాగోలేదనే సంగతి తెలిసిందే. మయోసైటిస్ అనే కండరాల వ్యాధితో ఆమె బాధపడుతున్నట్టు కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. ప్రస్తుతం అయితే ట్రీట్‌మెంట్ తీసుకుంటుంది. ఇంకా సమంత వ్యాధి నయం కాలేదని, ఈ నేపథ్యంలో సమంత సినిమా కెరీర్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసినట్లేనని ఆమె బాలీవుడ్ సినిమా సహా దాదాపు అన్ని ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తెలుగులో సమంత శాకుంతలం, ఖుషి చిత్రాలు చేస్తుండగా, శాకుంతలం షూటింగ్ అయితే పూర్తైంది.
విజయ్ దేవరకొండ కు జంటగా నటిస్తున్న ఖుషి ఇప్పటికీ పూర్తి కాలేదు. సమంత అనారోగ్య సమస్య ఖుషీ మూవీ షూటింగ్ పై పడుతుంది. కొంత షూటింగ్ జరుపుకున్న ఖుషి ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సమంత పార్ట్ పక్కన పెట్టి మిగతా షూట్ చేయనున్నారు. అయితే సమంత కొన్ని బాలీవుడ్ చిత్రాలకు సైన్ చేసిందని,ఆరోగ్యం ఇంకా కుదుట పడకపోవడంతో ఈ ప్రాజెక్ట్స్ నుండి సమంత తప్పుకోనున్నారట. అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం సమంత ఆ చిత్రాల షూట్లో పాల్గొనే అవకాశం లేదు అని అంటున్నారు.
సమంత సినిమాలకు సంబంధించి అనేక ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో మేనేజర్ క్లారిటీ ఇచ్చారు.. ‘‘సమంత ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత విజయ్ దేవరకొండ మూవీ ఖుషి సినిమా షూటింగ్‌లో సమంత పాల్గొంటారు. అనంతరం బాలీవుడ్ మూవీలో నటిస్తారు. నిజానికి సమంత నటించాల్సిన బాలీవుడ్ మూవీ జనవరిలో స్టార్ట్ కావాల్సి ఉండగా, మే నుంచి ఆ సినిమా షూటింగ్ సామ్ పాల్గొంటారు. ప్రస్తుతానికి సమంత ఓకే చేసిన ఏ ప్రాజెక్ట్ నుంచి ఆమె వెళ్లిపోవటం లేదు. ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నారు. అలాగే కొత్త ప్రాజెక్టులను ఆమె ఓకే చేయటం లేదు ఆయన చెప్పుకొచ్చారు.